Begin typing your search above and press return to search.

సిల్క్ చీరలో హుందాగా.. అమ్మడి అందానికి ఫిదా!

ఈ క్రమంలోనే తాజాగా సిల్క్ చీరలతో తన అందాన్ని రెట్టింపు చేసుకుని మరింత అందంగా వికసిస్తోంది కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్..

By:  Madhu Reddy   |   17 Oct 2025 10:01 AM IST
సిల్క్ చీరలో హుందాగా.. అమ్మడి అందానికి ఫిదా!
X

సాధారణంగా సెలబ్రిటీలు ఫ్యాషన్ దుస్తులతోనే కాకుండా సాంప్రదాయంగా కూడా రెడీ అవుతూ అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా సిల్క్ చీరలు కట్టుకోవడానికి ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగా ఎంబ్రాయిడరీతో అందంగా డిజైన్ చేసిన బ్లౌజులు వారి అందానికి మరింత అందాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సిల్క్ చీరలతో తన అందాన్ని రెట్టింపు చేసుకుని మరింత అందంగా వికసిస్తోంది కాంతార బ్యూటీ రుక్మిణి వసంత్..

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఈమె మొదట కన్నడలోనే సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మధ్య తెలుగులో కూడా అవకాశాలు అందుకుంటూ మరింత బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. అలా తొలిసారి గత ఏడాది నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. మొదటి సినిమా సక్సెస్ అవుతుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ అనుకున్న స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవ్వలేదు. తర్వాత తమిళంలో ఏ.ఆర్. మురుగదాసు దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటించిన 'మదరాసి' సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా అయినా సక్సెస్ అవుతుంది అనుకుంటే ఇది కూడా డిజాస్టర్ అయ్యింది. దీంతో వరుస డిజాస్టర్లు రుక్మిణి అతలాకుతలం చేశాయి.

కానీ కన్నడ హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 లో అవకాశం కల్పించారు. ఇందులో యువరాణి పాత్రలో కనకావతిగా తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అదరగొట్టేసింది రుక్మిణి వసంత్. కొన్ని కొన్ని సన్నివేశాలలో హీరో రిషబ్ శెట్టినే ఆమె తన నటనతో డామినేట్ చేసింది అంటే ఇక తన పాత్రకు ఏకంగా ఏ రేంజ్ లో న్యాయం చేసిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో యువరాణి పాత్ర పోషించింది కాబట్టి అందుకు తగ్గట్టుగానే ప్రతిదీ కూడా హుందాగా కనిపించడం కోసం సిల్క్ వస్త్రాలను ఆమె ఉపయోగించిన విషయం తెలిసిందే.

అందులో భాగంగానే సిల్క్ చీరలు కట్టుకొని అందుకు సంబంధించిన ఫోటోలను ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్త వైరల్ గా మారుతున్నాయి. పట్టు వస్త్రంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫ్రాక్ ధరించిన ఈమె.. మరొక ఫోటోలో ఎల్లో కలర్ పట్టుచీర కట్టుకొని మరింత అందంగా కనిపించింది. ఎల్లో కలర్ చీర మెరూన్ రెడ్ కలర్ బార్డర్ తో చాలా అందంగా నేసిన ఈ చీర యువతుల మనసులను కూడా దోచుకుంటుంది.

అంతేకాదు స్లీవ్ లెస్ మెరూన్ రెడ్ కలర్ బ్లౌజ్ చీరకు మరింత రెట్టింపు అందాన్ని తెచ్చిపెట్టింది అని చెప్పవచ్చు. సిల్క్ చీరలలో హుందాగా కనిపిస్తూ తన అందంతో ఆకట్టుకుంది. అంతేకాదు తన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి సింపుల్ బంగారు ఆభరణాలను ధరించి మరింత అందంగా ముస్తాబయింది రుక్మిణి వసంత్. ఈమె సినిమాల విషయానికొస్తే.. మరొకవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమాలో కూడా అవకాశాన్ని అందుకుంది.