Begin typing your search above and press return to search.

రుక్మిణి నేషనల్ క్రష్ రీప్లేస్..!

ఐతే ఈ సినిమాలో మరో హైలెట్ ఏంటంటే కనకావతి రోల్ చేసిన రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాటి సినిమాతో సౌత్ ఆడియన్స్ కి దగ్గరైన రుక్మిణి వరుస సినిమాలతో అదరగొట్టేస్తుంది.

By:  Ramesh Boddu   |   3 Oct 2025 10:39 AM IST
రుక్మిణి నేషనల్ క్రష్ రీప్లేస్..!
X

రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటించిన ఈ సినిమా మళ్లీ అతని మ్యాజిక్ తో మెస్మరైజ్ చేశాడు. సినిమా చూసిన ఆడియన్స్ సూపర్ అనేస్తున్నారు. కాంతారా సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సక్సెస్ అయ్యింది.

ఆ సినిమాలో క్లైమాక్స్ యాక్టింగ్ తో రిషబ్ శెట్టి నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. కాంతారా ప్రీక్వెల్ అదే కాంతారా చాప్టర్ 1 లో కూడా రిషబ్ శెట్టి నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ తో అదరగొట్టాడు. సినిమాపై ఉన్న అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా విజువల్ ఎక్స్ పీరియన్స్ అందించింది.

సప్త సాగరాలు దాటి సినిమాతో..

ఐతే ఈ సినిమాలో మరో హైలెట్ ఏంటంటే కనకావతి రోల్ చేసిన రుక్మిణి వసంత్. సప్త సాగరాలు దాటి సినిమాతో సౌత్ ఆడియన్స్ కి దగ్గరైన రుక్మిణి వరుస సినిమాలతో అదరగొట్టేస్తుంది. ఈమధ్యనే శివ కార్తికేయన్ మదరాసి సినిమాలో నటించింది రుక్మిణి. ఇక కాంతారా చాప్టర్ 1లో తన రోల్ తో సర్ ప్రైజ్ చేసింది రుక్మిణి. ఆల్రెడీ యూత్ ఆడియన్స్ ఆమె వల్లో పడగా.. తన పెర్ఫార్మెన్స్ తో మరింత సర్ ప్రైజ్ చేస్తుంది అమ్మడు.

కాంతారా చాప్టర్ 1 చూసిన ప్రతి ఒక్కరు కూడా రుక్మిణి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఇక కొందరైతే నేషనల్ క్రష్ ట్యాగ్ ని రుక్మిణికి ఇచ్చేయాల్సిందే అని అంటున్నారు. నేషనల్ క్రష్ గా రష్మిక మందన్న కొనసాగుతుంది. గ్లామర్, యాక్టింగ్ రెండిటిలో రష్మిక దూసుకెళ్తుంది. ఐతే ఇప్పుడు ఆ నేషనల్ క్రష్ ట్యాగ్ ని రుక్మిణితో రీప్లేస్ చేస్తుందని అంటున్నారు. రుక్మిణి నిజంగానే ఆ రేంజ్ కెపాసిటీ ఉందని ప్రూవ్ చేసుకుంటుంది.

ఎన్టీఆర్ సినిమాలో..

కాంతారా చాప్టర్ 1లో ఆమె లుక్స్, యాక్టింగ్ అన్నీ కూడా అదుర్స్ అనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ అమ్మడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో సినిమాలో ఛాన్స్ అందుకుంది. సో ఆ సినిమాతో మళ్లీ అమ్మడు పాన్ ఇండియా లెవెల్ లో డిస్కషన్స్ లో ఉంటుంది. రుక్మిణి వసంత్ చూస్తుంటే సౌత్ లో టాప్ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. కాంతారా 1 ని రిషబ్ శెట్టి కోసం మాత్రమే కాదు రుక్మిణి వసంత్ కోసం చూసే వాళ్లు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే. సౌత్ లో ఏమో కానీ టాలీవుడ్ లో మాత్రం రుక్మిణికి క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. తారక్ సినిమాతో తెలుగులో అమ్మడు స్టార్ రేంజ్ కి వెళ్లబోతుంది. సో రష్మికకు టఫ్ ఫైట్ మొదలైనట్టే అని చెప్పొచ్చు.