సామ్ - కాజల్ రేంజ్ లో ఈ బ్యూటీ క్లిక్కవ్వగలదా?
సినీ ఇండస్ట్రీలో ఒక్క మూవీతో క్లిక్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అప్పటి వరకు పలు సినిమాలు చేసినా.. లేక ఒక్క మూవీ కూడా చేయకపోయినా.. ఏదో ఒక చిత్రంతో కెరీర్ మలుపులు తిరుగుతోంది.
By: M Prashanth | 6 Sept 2025 9:30 AM ISTసినీ ఇండస్ట్రీలో ఒక్క మూవీతో క్లిక్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అప్పటి వరకు పలు సినిమాలు చేసినా.. లేక ఒక్క మూవీ కూడా చేయకపోయినా.. ఏదో ఒక చిత్రంతో కెరీర్ మలుపులు తిరుగుతోంది. ఆ తర్వాత వరుస ఆఫర్లు అందుకుంటారు. నాన్ స్టాప్ గా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంటారు. ఇండస్ట్రీని ఏలుస్తుంటారు.
అయితే స్టార్ హీరోయిన్స్ సమంత, కాజల్ అగర్వాల్ కూడా అంతే. తమ అందం, అభినయంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వరుస అవకాశాలు సొంతం చేసుకున్నారు. ఆనేక సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్నారు. కొంతకాలంపాటు ఇండస్ట్రీని ఏలేశారు. ఇప్పుడు వారి లాగే కనిపిస్తోంది మరో బ్యూటీ.
బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఆమెనే రుక్మిణీ వసంత్. కన్నడ భామ అయిన అమ్మడు.. రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది. ఆ సినిమాలో మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపిస్తూనే ఒక మంచి భార్యగా నటించి అందరినీ మెప్పించింది.
తెలుగులో కూడా సినిమా హిట్ అవ్వగా.. అందరి దృష్టిలో పడింది. సప్త సాగరాలు దాటి రెండు సినిమాలతో బాగా పాపులర్ అవ్వడంతో ఆమెకు వరుస అవకాశాలు సొంతమయ్యాయి. కన్నడలో బానదారియల్లి, భగీర, భైరతి రణగల్ వంటి చిత్రాల్లో నటించి ఆమె.. తమిళంలో ఎస్, తెలుగులో అపుడో ఇపుడో ఎపుడో సినిమాల్లో తన యాక్టింగ్ తో అలరించింది.
రీసెంట్ గా మదరాసి సినిమాలో నటించిన రుక్మిణీ.. ప్రస్తుతం మూడు భారీ పాన్ ఇండియాల్లో యాక్ట్ చేస్తుండడం విశేషం. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్- స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తోంది. కన్నడ ప్రముఖ నటుడు యష్ టాక్సిక్ తోపాటు స్టార్ హీరో రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 సినిమాల్లో ఆమెనే ఫిమేల్ లీడ్ కావడం గమనార్హం.
తారక్ ది తెలుగు ఒరిజినల్ అయినా.. మిగతా రెండు కూడా మన దగ్గర భారీగా రిలీజ్ కానున్నాయి. దీంతో టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది అమ్మడు. దీంతో సామ్, కాజల్ లాగా రుక్మిణి టాలీవుడ్ లో క్లిక్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి సామ్ - కాజల్ రేంజ్ లో ఈ బ్యూటీ క్లిక్కవ్వగలదో లేదో చూడాలి.
