వరుస భారీ ప్రాజెక్ట్ లు.. హిట్టైతే పాన్ఇండియా హీరోయినే
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఏస్ సినిమాతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది హీరోయిన్ రుక్మిణి వసంత్.
By: M Prashanth | 3 Sept 2025 10:34 AM ISTతమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఏస్ సినిమాతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది హీరోయిన్ రుక్మిణి వసంత్. సప్తసాగరాలు దాటి సినిమాతో ఆమెకు మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు శివకార్తికేయన్ మధరాసి సినిమాతో మళ్లీ తమిళ సినిమా ఇండస్ట్రీలోకి తిరిగి వస్తోంది. ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
మధరాసి సినిమాతో పాటు అక్టోబర్ 2న కన్నడ స్టార్ రిషభ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈసినిమాలోనూ రుక్మిణీ
కీలక పాత్ర పోషిస్తోంది. ఇలా రెండు భారీ సినిమాల్లో నటించడంతో దేశవ్యాప్తంగా ఆమెకు ఈ భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు వస్తున్నాయి. సప్త సాగరదాటి సినిమా తర్వాక రుక్మిణీ నెమ్మదిగా పాన్ ఇండియన్ స్టార్ గా దేశవ్యాప్తంగా ముద్ర వేస్తోంది.
మధరాసి, కాంతారా: చాప్టర్ 1తో పాటు, కేజీఎఫ్ స్టార్ యష్ టాక్సిక్, జూనియర్ ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ ల డ్రాగన్ వంటి భారీ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇలాంటి భారీ అంచనాలు ఉన్న ఈ రెండు సినిమాలు పాన్ఇండియా రేంజ్ లో హిట్టైతే.. రుక్మిణి ఇండియాలోనే బడా స్టార్ గా ఎదిగిపోవడం ఖాయం. ఇవి ప్రస్తుతం భారతీయ సినిమాలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరిగా మారే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇప్పటివరకు తమిళంలో ఒకే సినిమాలో మాత్రమే నటించినప్పటికీ, రుక్మిణి తన స్క్రీన్ ప్రెజెన్స్, ఆకర్షణీయమైన లుక్స్ తో తమిళ ప్రేక్షకులలో ఇప్పటికే భారీ స్థాయిలో అభిమానులను ఏర్పరచుకుంది. ఇక రాబోయే సినిమాలు బాగా ఆడితే, ఆమె త్వరలోనే పాన్ఇండియా హీరోయిన్ గా ఎలైట్ లిస్ట్ లో చేరుతుంది.
ఇప్పటికైతే, అందరి దృష్టి మధరాసి సినిమాపై ఉంది. ఇది కొన్ని రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రం ఆమె కెరీర్ లో కీలకం అవుతుంది. ఆమె జాతీయ స్థాయి స్టార్ డమ్ కు టోన్ సెట్ చేసే బ్లాక్‌బస్టర్‌గా మారుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
