రుక్మిణి ఖాతాలో మూడు పాన్ ఇండియాలు
ఇటీవలి కాలంలో రష్మిక మందన్న, కియరా అద్వాణీ, శ్రీలీల లాంటి పాపులర్ పేర్లు మాత్రమే వింటున్నాం. అలాంటి సమయంలో రేస్ లోకి దూసుకొచ్చింది రుక్మిణి వసంత్.
By: Sivaji Kontham | 29 Nov 2025 5:00 AM ISTఇటీవలి కాలంలో రష్మిక మందన్న, కియరా అద్వాణీ, శ్రీలీల లాంటి పాపులర్ పేర్లు మాత్రమే వింటున్నాం. అలాంటి సమయంలో రేస్ లోకి దూసుకొచ్చింది రుక్మిణి వసంత్. ఈ బ్యూటీ కాంతార 2లో రాకుమారి పాత్రలో అద్భుత అభినయంతో ఆకట్టుకుంది. కాంతార 2 బాక్సాఫీస్ వద్ద దాదాపు 800కోట్లు వసూలు చేసింది.
ఈ సినిమాతో పాటు, యష్‌తో `టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్`, జూనియర్ ఎన్టీఆర్ తో మోస్ట్ అవైటెడ్ NTRనీల్ ప్రాజెక్టులోను నటిస్తోంది. రుక్మిణి కెరీర్ ఇటీవల కొత్త దశలోకి ప్రవేశించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని, ఇద్దరు బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్లతో సినిమాలు తన రేంజును అమాంతం పెంచేస్తాయని కూడా అంచనా వేస్తున్నారు. రెండు క్రేజీ పాన్ ఇండియన్ సినిమాలు 1000 కోట్ల క్లబ్ లో చేరతాయని కూడా ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు మరో పెద్ద స్టార్ తో పాన్ ఇండియన్ సినిమాకి రుక్మిణి సంతకం చేయబోతోందన్న గుసగుస కూడా వినిపిస్తోంది.
ఇక రుక్మిణి గురించి తెలుసుకోవాల్సిన చాలా విషయాలున్నాయి. ఈ భామ ఇకపై ఒకసారి ఒక విషయంపై మాత్రమే దృష్టి సారిస్తానని చెప్పింది. ఫోన్‌లు మన దృష్టిని చెదరగొట్టగలవు. కాబట్టి కొన్నిసార్లు నేను జర్నల్ లేదా స్కెచ్ చేసాను. పాత్ర నుండి భావోద్వేగపరంగా కొట్టుకుపోకుండా ఒక వస్తువుపై ఘాఢంగా దృష్టి పెట్టడానికి స్కెచింగ్ నాకు చాలా సహాయపడిందని రుక్మిణి తెలిపింది.
రుక్మిణి నటనలోకి అడుగుపెట్టడానికి చాలా కాలం ముందు నుండి కథలను చాలా ప్రేమిస్తుంది. తన బాల్యం లోనే అమర్ చిత్ర కథ - టింకిల్ కామిక్స్ చదివిన రోజులను గుర్తు చేసుకుంది. స్వచ్ఛమైన హాస్యం కోసం, డెర్రీ గర్ల్స్ ఆమె ఎంపిక. తనకు `ఓం శాంతి ఓం` ఇష్టమైన చిత్రం అని కూడా చెప్పింది. ఇది పరిశ్రమను ప్రేమ సహా ఎప్పుడూ ద్వేషం నుంచి బయటపడేలా చేస్తుంది. నేను దానిని చూసిన ప్రతిసారీ కొత్తదాన్ని కనుగొంటాను అని రుక్మిణి చెప్పింది.
