మరో ఉద్యోగం వెతుక్కోవాలేమో అనుకున్నా!
కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ఇప్పుడో సంచలనం. వరుసగా పాన్ ఇండియా చాన్సులందుకుంటూ తానో బ్రాండ్ గా వెలిగిపోతుంది.
By: Srikanth Kontham | 2 Sept 2025 5:00 AM ISTకన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ ఇప్పుడో సంచలనం. వరుసగా పాన్ ఇండియా చాన్సులందుకుంటూ తానో బ్రాండ్ గా వెలిగిపోతుంది. సప్తసాగరాలు చిత్రం తర్వాత సౌత్ లో వచ్చిన అసాధారణ గుర్తింపుతోనే ఇది సాధ్యమైంది. నటిగా ఊహించని అవకాశాలే అందుకుంటుంది. `కాంతార చాప్టర్ 1`, `డ్రాగన్,` `టాక్సిక్` ఇవన్నీ ఆన్ సెట్స్ లో ఉన్న చిత్రాలు. త్వరలో మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `మద రాసి`తోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటికంటే ముందే కన్నడలో కొన్ని సినిమాలు చేసింది.
తెలుగులో `అప్పుడో ఇప్పుడో ఎప్పుడో` అంటూ మరో సినిమా కూడా చేసింది. అమ్మడి అందం , అభినయానికి సౌత్ ఇండస్ట్రీ ఫిదా అయింది. ట్యాలెంట్ తో బ్యూటీ కూడా కలిసి రావడంతో గొప్ప అవకాశాలు అందుకోల్గుతుంది. అయితే ఇలా వరుసగా అవకాశాలు అందుకోవడం తన వరకూ ఓ లక్కీ గాళ్ గానే చెప్పుకొచ్చింది. సప్తసాగరాలు దాటకుండా మరో సినిమా గురించి మాట్లాడం ఎంత మాత్రం భావ్యం కాదంది. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతోనే కొత్త అవకాశాలెన్నో వచ్చాయంది.
ఆ సినిమా గురించి మాట్లాడకుండా మరో సినిమా గురించి మాట్లాడే స్థాయికి తాను ఇంకా చేరలేదంది. అయితే ఆ స్థాయిని దాటి పైకి వెళ్తానని తాను ఎప్పుడూ ఊహించలేదంది. సప్తసాగరాలు తర్వాతే కొత్త అవకాశాలు వచ్చాయంది. `ఒకవేళ ఆ సినిమా తర్వాత అవకాశాలు రాకపోయి ఉంటే మరో ఉద్యోగం చేసుకోవాల్సిందే. ఇక్కడే ఉండి అనవసరంగా సమయం వృద్దా చేసుకోవాలని ముందు నుంచి అనుకోలేదని, ఓ ప్రయత్నం చేద్దామని వచ్చినట్లు తెలిపింది.
అదృష్టం కొద్ది అవకాశాలు రావడంతోనే బిజీ నటిగా మారినట్లు తెలిపింది. సాధారణంగా సక్సెస్ వచ్చిన తర్వాత కొందరు కెరీర్ వెనక్కి వెళ్లడానికి ఆలోచిస్తారు. గతాన్ని వర్తమానంతో ముడి పెట్టి మాట్లాడటానికి తడబడతారు . అవసరాలు తీర్చిన ఇండస్ట్రీనే మర్చిపోయిన వారు చాలా మంది ఉన్నారు. కానీ రుక్మీణి వసంత్ మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. అమ్మడి వ్యాఖ్యల ద్వారా తన లో డౌన్ టూ ఎర్త్ క్వాలిటీ బయట పడుతుంది.
