Begin typing your search above and press return to search.

నేషనల్ క్రష్ ట్యాగ్.. షిఫ్ట్ అవుతుందా?

నేషనల్ క్రష్ అంటే చాలు.. ఎవరికైనా రష్మిక మందన్న పేరు వెంటనే గుర్తుకొస్తుంది.

By:  M Prashanth   |   13 Oct 2025 9:13 AM IST
నేషనల్ క్రష్ ట్యాగ్.. షిఫ్ట్ అవుతుందా?
X

నేషనల్ క్రష్ అంటే చాలు.. ఎవరికైనా రష్మిక మందన్న పేరు వెంటనే గుర్తుకొస్తుంది. నార్త్ టు సౌత్.. వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోతున్న అమ్మడు.. కొన్నాళ్లుగా నేషనల్ ట్యాగ్ తో సందడి చేస్తోంది. ఇప్పుడు ఆ ట్యాగ్ షిఫ్ట్ అవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో అదే ట్రెండ్ అవుతోంది.

కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ సప్త సాగరాలు దాటి మూవీతో తెలుగు సినీ ప్రియులకు చేరువైన విషయం తెలిసిందే. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించిన అమ్మడు.. ఇప్పుడు ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నారు. వరుస ఛాన్సులు అందుకుని జోరు మీద ఉన్న ఆమె.. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ మూవీతో టాలీవుడ్ లోకి రానున్నారు.

రీసెంట్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచిన కాంతార చాప్టర్ 1లో యువరాణి పాత్రలో అదరగొట్టారు. కనకవతిగా అమ్మడి యాక్టింగ్ కు అంతా ఫిదా అయ్యారు. యువరాణిగా చూపించిన గాంభీర్యానికి అట్రాక్ట్ అయ్యారు. క్లైమాక్స్‌ లో తనలోని టాలెంట్ మొత్తాన్ని బయటపెట్టి ఒక్కసారిగా తనవైపునకు అందరి దృష్టిని తిప్పుకున్నారనే చెప్పాలి.

దీంతో ఇప్పుడు అంతా ఆమెను నేషనల్ క్రష్ అని పిలుస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని గంటలుగా ఆ విషయాన్ని హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. ఇంకొందరు నెటిజన్లు.. రష్మిక ఫస్ట్ నేషనల్ క్రష్ అయితే రుక్మిణీ వసంత్ సెకండ్ నేషనల్ క్రష్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అమ్మడు పాన్ ఇండియా హీరోయిన్ అంటూ కితాబిస్తున్నారు.

ఇక రుక్మిణీ వసంత్ విషయానికొస్తే.. కన్నడ మూవీ బీర్బల్ త్రయం మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అప్పుడో ఇప్పుడు ఎప్పుడో సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చింది అమ్మడు. కానీ సూపర్ హిట్ మూవీ సప్త సాగరాలు దాటితో తెలుగు ఆడియన్స్ కు చేరువైంది. విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు రుక్మిణి.

ఇటీవల కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ మదరాసితో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తన నటనతో ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న డ్రాగన్ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. కన్నడ స్టార్ హీరో యష్ టాక్సిక్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు మరిన్ని సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నారు.