Begin typing your search above and press return to search.

గోల్డెన్ కలర్ లెహంగాలో గ్లామర్ తో అలరించిన రుక్మిణి!

రుక్మిణి వసంత్... ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె గురించే చర్చ జరుగుతోంది.

By:  Madhu Reddy   |   1 Sept 2025 3:50 PM IST
గోల్డెన్ కలర్ లెహంగాలో గ్లామర్ తో అలరించిన రుక్మిణి!
X

రుక్మిణి వసంత్... ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె గురించే చర్చ జరుగుతోంది. కారణం వరుసగా పాన్ ఇండియా సినిమాలలో అవకాశం అందుకోవడమే అని చెప్పాలి. ప్రస్తుతం ఈమె.. కోలీవుడ్ లో ఏ.ఆర్.మురగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న 'మదరాసి' అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహికులు ఘనంగా నిర్వహించారు. ఇందులో గోల్డెన్ కలర్ లెహంగా ధరించి తన గ్లామర్ తోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతేకాదు అందంతో ఈ ఈవెంట్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది రుక్మిణి వసంత్.


అసలు విషయంలోకి వెళ్తే.. మదరాసి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా గోల్డెన్ కలర్ లెహంగా ధరించిన ఈమె.. దీనికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ లో సాఫ్ట్ దుపట్టా ధరించి.. తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది. అంతేకాదు సింపుల్ జువెలరీతో మరింత ప్రకాశవంతంగా వెలిగిపోయింది. అటు అందంగా కనిపించడమే కాకుండా ఇటు సాంప్రదాయంగా కూడా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది రుక్మిణి వసంత్.. సింపుల్ లుక్ తో.. మరింత గ్లామర్ వలకబోస్తూ ఎటువంటి హుందాతనం లేకుండా చాలా సైలెంట్ గానే అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం రుక్మిణి వసంత్ ధరించిన ఈ అవుట్ ఫిట్ అభిమానులను కూడా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.


రుక్మిణి వసంత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు అందుకుంటుంది. అందులో భాగంగానే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న 'డ్రాగన్' అనే సినిమాలో ఈమె హీరోయిన్ గా ఎంపికయింది.. అంతేకాదు 'కాంతార' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రిషబ్ శెట్టి ప్రస్తుతం 'కాంతార : చాప్టర్ వన్' అంటూ అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో కూడా హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది.



అలాగే కేజిఎఫ్ చిత్రాలతో సంచలనం సృష్టించిన యష్ తాజాగా నటిస్తున్న చిత్రం టాక్సిక్. ఇందులో కూడా రుక్మిణి హీరోయిన్ గా అవకాశం అందుకుంది.. ఇలా వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో.. బడా హీరోలతో అవకాశాలు అందుకోవడంతో సైలెంట్ గానే పెద్ద పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంది అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె లైనప్ గురించి మదరాసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత ఎన్.వీ. ప్రసాద్ స్పష్టం చేశారు.


రుక్మిణి వసంత్ కెరియర్.. నిఖిల్ హీరోగా నటించిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది కన్నడ ముద్దుగుమ్మ. 1994 డిసెంబర్ 10న కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఈమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. ఈయన భారతదేశ అత్యున్నత శాంతికాల సైనిక అలంకరణ అయిన అశోక చక్ర కర్ణాటక రాష్ట్రం నుండి అందుకున్న మొదటి వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకున్నారు.. ఈమె లండన్ లోని బ్లూమ్స్ బరీ లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ నుండి నటన పట్టా అందుకుంది