Begin typing your search above and press return to search.

రంగస్థలం కాంబోలో 'సప్త' సుందరి..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  M Prashanth   |   30 Dec 2025 1:01 PM IST
రంగస్థలం కాంబోలో సప్త సుందరి..?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, లెక్కల మాస్టారు సుకుమార్ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'రంగస్థలం' బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. కాబట్టి ఈసారి కంటెంట్ డోస్ అంతకుమించి ఉంటుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ ప్రాజెక్ట్ గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తోంది.

ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇందులో హీరోయిన్ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రంగస్థలంలో రామలక్ష్మిగా సమంత మ్యాజిక్ చేసింది. మరి ఈసారి సుకుమార్ ఎవరిని ఎంపిక చేస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. పాన్ ఇండియా సినిమా కాబట్టి బాలీవుడ్ బ్యూటీలను దింపుతారని కొందరు, లేదు తెలుగమ్మాయిని తీసుకుంటారని మరికొందరు ఊహించుకున్నారు.

లేటెస్ట్ గా ఈ సస్పెన్స్ కు తెరదించుతూ ఫిలిం నగర్ లో ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కథ డిమాండ్ మేరకు ఈసారి ఒక మంచి పర్ఫార్మర్ ని, అదే సమయంలో ఫ్రెష్ ఫేస్ ని తీసుకోవాలని సుకుమార్ భావించారట. ఈ క్రమంలోనే కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఒక సెన్సేషనల్ బ్యూటీని ఆడిషన్ చేసి, ఫైనల్ గా ఆమెనే ఈ ప్రాజెక్ట్ కోసం లాక్ చేశారని టాక్ గట్టిగా వినిపిస్తోంది.

ఇంతకీ చరణ్ సరసన ఛాన్స్ కొట్టేసిన ఆ లక్కీ బ్యూటీ ఎవరో కాదు.. 'సప్త సాగరాలు దాటి' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న రుక్మిణి వసంత్. ఆ సినిమాలో తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, నేచురల్ యాక్టింగ్ తో అందరినీ మాయ చేసిన ఈ కన్నడ బ్యూటీ, ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించే జాక్ పాట్ కొట్టేసిందనే టాక్ వైరల్ అవుతోంది. ఇటీవలే ఆమె సుకుమార్ ను కలిశారని, లుక్ టెస్ట్ కూడా పూర్తయ్యిందని సమాచారం.

అయితే సినిమాలో కేవలం రుక్మిణి వసంత్ మాత్రమే కాదు, మరో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉందని తెలుస్తోంది. కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, అందులో మెయిన్ లీడ్ గా రుక్మిణిని తీసుకున్నారని టాక్. రెండో హీరోయిన్ గా ఒక బాలీవుడ్ బ్యూటీ పేరు పరిశీలనలో ఉన్నా, ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. సుకుమార్ ఎప్పుడూ హీరోయిన్ పాత్రలను చాలా బలంగా రాస్తారు కాబట్టి, రుక్మిణికి ఇది కెరీర్ బెస్ట్ రోల్ అయ్యే అవకాశం ఉంది. ఇక సుకుమార్ తన మార్క్ కాస్టింగ్ తోనే సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు 'పెద్ది' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ కమిట్మెంట్ పూర్తవ్వగానే సుకుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.