రేడియంట్ లుక్కులో రుక్మిణి.. గ్లామర్ లుక్ కి కొత్త నిర్వచనం!
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న వారిలో రుక్మిణి వసంత్ కూడా ఒకరు.
By: Madhu Reddy | 8 May 2026 9:48 AM ISTచిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న వారిలో రుక్మిణి వసంత్ కూడా ఒకరు. 2024లో నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈమె.. తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఎప్పుడైతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్నారనే వార్త తెరపైకి వచ్చిందో అప్పటినుంచి రుక్మిణి వసంత్ పేరు బాగా వినిపించింది. దీనికి తోడు శివ కార్తికేయన్ హీరోగా నటించిన మదరాసి సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో అటు డైరెక్టర్ కూడా ఈమెపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన కామెంట్లు ఈమెకు బాగా కలిసి వచ్చాయి.
అయితే అటు తెలుగు ఇటు తమిళ్ రెండు భాషల్లో చేసిన తొలి చిత్రాలు డిజాస్టర్ గా నిలవడంతో నిరాశ వ్యక్తం చేసింది రుక్మిణి వసంత్. కానీ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా చాప్టర్ వన్ చిత్రంతో ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో మొదట్లో సౌమ్యంగా కనిపిస్తూనే చివర్లో విలన్ గా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతేకాదు కొన్ని సన్నివేశాలలో హీరో రిషబ్ శెట్టిని మించి తన అద్భుతమైన నటనను కనబరిచి అందరిని మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఒక్క సినిమా పాన్ ఇండియా క్రేజ్ ను అందించి పెట్టింది. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న డ్రాగన్ సినిమాలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
ఒకవైపు పాన్ ఇండియా ప్రాజెక్టులలో భాగమవుతూనే మరొకవైపు తన ఉనికిని చాటుకోవడానికి ఇటు సోషల్ మీడియాలో కూడా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ప్రముఖ మ్యానిఫెస్టో మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఫోటో షూట్ నిర్వహించింది. ఈ ఒక్క ఫోటో ఫ్యాషన్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోందని చెప్పవచ్చు. మ్యానిఫెస్టో మ్యాగజైన్ కవర్ పేజ్ కోసం షేర్ చేసిన ఈ ఫోటోలలో గులాబీ రంగు సీక్విన్ దుస్తులకు... పొడవాటి నల్లని జుట్టుపై అద్భుతమైన సాంప్రదాయ బంగారు హెయిర్ యాక్సెసరీస్ లను జత చేసింది. కళ్ళు మూసుకొని అటుగా తిరిగి జుట్టును.. జుట్టులో పొదిగిన బంగారు ఆభరణాలను చూపిస్తూ అచ్చం దేవకన్యలా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.
మరికొన్ని ఫోటోలలో ఆలివ్ గ్రీన్ కలర్ డ్రెస్ ధరించిన ఈమె... బంగారు ఉంగరాలు, బంగారు గాజులు ధరించి తలకు చెయ్యి పట్టుకొని తీక్షణంగా ఏదో చూస్తున్నట్టు ఫోటోలకి ఫోజులిచ్చింది. మొత్తానికి అయితే రుక్మిణి వసంత్ ఈ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం ఇచ్చిన ఈ లేటెస్ట్ ఫోటోషూట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.
రుక్మిణి వసంత్ విషయానికి వస్తే.. కన్నడ మాట్లాడే కుటుంబంలో 1994 డిసెంబర్ 10న జన్మించింది. ఈమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ భారతదేశ అభ్యున్నత శాంతికాల సైనిక అలంకరణ అయిన అశోక చక్ర కర్ణాటక రాష్ట్రం నుండి అందుకున్న మొదటి వ్యక్తిగా సంచలనం సృష్టించారు. ఇకపోతే ఈమె రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ లో నటన పట్టా అందుకున్నారు.
