Begin typing your search above and press return to search.

టాక్సిక్ పై అంచ‌నాల‌ను పెంచేసిన రుక్మిణి

ఇదిలా ఉంటే ఈ సినిమాలో క‌న్న‌డ బ్యూటీ రుక్మిణి వ‌సంత్ ఓ కీల‌క పాత్ర‌లో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. టాక్సిక్ కోసం రుక్మిణి ఇప్ప‌టికే ప‌లు షెడ్యూల్స్ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు.

By:  Sravani Lakshmi Srungarapu   |   7 Nov 2025 12:12 PM IST
టాక్సిక్ పై అంచ‌నాల‌ను పెంచేసిన రుక్మిణి
X

క‌న్న‌డ రాక్ స్టార్ య‌ష్ హీరోగా తెర‌కెక్కుతున్న టాక్సిక్ మూవీ భారీ స్థాయిలో రూపొందుతున్న విష‌యం తెలిసిందే. గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది మార్చి 19న రిలీజ్ కానుంద‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే అనౌన్స్ చేశారు. కానీ రీసెంట్ గా ఈ సినిమా వాయిదా ప‌డుతుంద‌ని సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌లు నెట్టింట అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి.

వాయిదా వార్త‌ల‌పై క్లారిటీ ఇచ్చిన టాక్సిక్ టీమ్

అయితే ఈ వార్తల‌ను ఖండిస్తూ త‌మ సినిమా క‌చ్ఛితంగా మార్చి 19నే రిలీజ్ కానుంద‌ని మేక‌ర్స్ చెప్ప‌డంతో టాక్సిక్ రిలీజ్ విష‌యంలో అంద‌రికీ క్లారిటీ వ‌చ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో క‌న్న‌డ బ్యూటీ రుక్మిణి వ‌సంత్ ఓ కీల‌క పాత్ర‌లో నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. టాక్సిక్ కోసం రుక్మిణి ఇప్ప‌టికే ప‌లు షెడ్యూల్స్ షూటింగ్ ను కూడా పూర్తి చేశారు.

మునుపెన్న‌డూ ఇండియన్ సినిమాలో చూడ‌ని రీతిలో..

టాక్సిక్ లో రుక్మిణి వ‌సంత్ న‌టిస్తున్న విష‌యాన్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా వెల్ల‌డించ‌న‌ప్ప‌టికీ రీసెంట్ గా ఈ విష‌య‌మై రుక్మిణి ఓ హింట్ ఇచ్చారు. తాజాగా ఇన్‌స్టాలో ఫ్యాన్స్ తో ఇంట‌రాక్ట్ అయిన రుక్మిణి టాక్సిక్ మూవీ వ‌ర్క్ ఎక్స్‌పీరియెన్స్ ను షేర్ చేసుకోవ‌డంతో పాటూ ఆ సినిమాను తెగ పొగిడేశారు. ఇప్ప‌టివ‌ర‌కు క‌న్న‌డ, ఇండియ‌న్ సినిమాలో చూడ‌ని విధంగా టాక్సిక్ రూపొందుతుంద‌ని, గీతూ ఈ మూవీని చాలా ప‌క‌డ్బందీగా తెర‌కెక్కిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు.

సినిమాలో న‌టించే ఎవ‌రైనా ఇలాంటి వ్యాఖ్య‌లు చేసిన‌ప్పుడు స‌హ‌జంగానే స‌గ‌టు చిత్రంపై అంచ‌నాలు పెరుగుతాయి. అందులోనూ రుక్మిణి లాంటి టాలెంటెడ్ న‌టి ఈ విష‌యాన్ని చెప్ప‌డంతో టాక్సిక్ లో ఆడియ‌న్స్ ను అంత‌గా ఎట్రాక్ట్ చేసే విష‌య‌మేంటో చూడ్డానికి ఆడియ‌న్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాలో న‌య‌న‌తార, హుమా ఖురేసి, తారా సుతారియా కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా, కెవిఎన్ ప్రొడక్ష‌న్స్ టాక్సిక్ ను భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది.