Begin typing your search above and press return to search.

కాంతార రుక్మిణి మళ్ళీ ట్రెండింగ్.. ఎందుకంటే..?

కన్నడ భామ రుక్మిణి వసంత్ కి లక్కు మామూలుగా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం సౌత్ లో కాదు కాదు నేషనల్ వైడ్ గా అమ్మడు మరోసారి ట్రెండింగ్ లో ఉంది.

By:  Ramesh Boddu   |   11 Nov 2025 11:43 AM IST
కాంతార రుక్మిణి మళ్ళీ ట్రెండింగ్.. ఎందుకంటే..?
X

కన్నడ భామ రుక్మిణి వసంత్ కి లక్కు మామూలుగా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం సౌత్ లో కాదు కాదు నేషనల్ వైడ్ గా అమ్మడు మరోసారి ట్రెండింగ్ లో ఉంది. సప్త సాగరాలు దాటి సినిమాలో ప్రియ పాత్రలో ప్రేక్షకుల మనసులు దోచేసింది రుక్మిణి. ఆ సినిమాలో ఆమె కోజప్ షాట్స్ ని చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ సినిమాతో పాపులర్ అయిన రుక్మిణి తమిళంలో వరుస సినిమాలు చేస్తుంది. ఐతే రీసెంట్ గా వచ్చిన కాంతారా చాప్టర్ 1 లో కనకావతి రోల్ లో అదరగొట్టేసింది రుక్మిణి.

కాంతారా 1 లో ఆమె లుక్స్ మైండ్ లో నుంచి పోవట్లేదు..

కాంతారా చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంలో రిషబ్ శెట్టి యాక్టింగ్ ఎంత ఇంప్రెస్ చేసింది కనకావతి రోల్ లో రుక్మిణి వసంత్ కూడా అదే రేంజ్ లో ఇంప్రెస్ చేసింది. రుక్మిణి వసంత్ ఫ్యాన్స్ కి అయితే కాంతారా లో ఆమె లుక్స్ మైండ్ లో నుంచి పోవట్లేదు అనే రేంజ్ లో ఇంపాక్ట్ చూపించింది. కాంతారా 1 థియేట్రికల్ రన్ నడుస్తున్న రోజులు రుక్మిణి వసంత్ సోషల్ మీడియాని ఊపేసింది. సినిమాలో ఆమె లుక్స్ అయితే వర్ణించడానికి మాటల్లేవ్ అనేలా ఉన్నాయని డిస్కస్ చేశారు.

ఇక ఇప్పుడు మళ్లీ కాంతారా చాప్టర్ 1 లో రుక్మిణి రోల్ గురించి ఆమె లుక్స్ గురించి సోషల్ మీడియాలో మరోసారి హడావిడి చేస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 సినిమా ఈమధ్యనే ఓటీటీ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్ లో సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ప్రైమ్ వీడియోస్ లో రిలీజైన కాంతారా 1 మళ్లీ వార్తల్లో నిలుస్తుంది. రిషబ్ యాక్టింగ్ గురించి అతని టేకింగ్ అదే డైరెక్షన్ గురించి సూపర్ అనేస్తున్నారు ఆడియన్స్. ఇక అదే క్రమంలో హీరోయిన్ రుక్మిణి వసంత్ గురించి కూడా మళ్లీ ట్రెండింగ్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ డ్రాగన్ లో రుక్మిణి..

కాంతారా 1 లో రుక్మిణి తప్ప మరో హీరోయిన్ ని ఊహించలేకపోతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా రుక్మిణి వసంత్ కి కాంతారా మంచి క్రేజ్ ఏర్పడేలా చేసింది. ఆమె మీద ఉన్న అంచనాలకు చేస్తున్న పాత్రలు తోడై అమ్మడికి విపరీతమైన ఫాలోయింగ్ తెస్తున్నాయి. ఐతే రుక్మిణి వసంత్ నెక్స్ట్ ఎన్టీఆర్ డ్రాగన్ లో హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో స్ట్రైట్ గా నిఖిల్ తో ఒక సినిమా చేసింది రుక్మిణి. కానీ దాన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ కాంతారా 1 ఇచ్చిన క్రేజ్ తో తప్పకుండా రుక్మిణి చేసే ప్రతి సినిమా మంచి స్కోప్ దొరికే ఛాన్స్ ఉంటుంది.

కొందరైతే నేషనల్ క్రష్ ట్యాగ్ ని రష్మిక నుంచి రుక్మిణికి ఇచ్చేయాలని కోరుతున్నారు. మరి ఈ సరికొత్త నేషనల్ క్రష్ ఎలాంటి పాత్రలు, సినిమాలు చేసి మెప్పిస్తుందో చూడాలి.