Begin typing your search above and press return to search.

క‌న‌క‌వ‌తి ద‌య‌, ధైర్యంతో లొంగ‌దీసుకుంటుంది!

క‌న్న‌డ బ్యూటీ రుక్మిణీ వ‌సంత్ ఇప్పుడో సంచ‌ల‌నం. వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలకు క‌మిట్ అవ్వ‌డంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

By:  Srikanth Kontham   |   25 Sept 2025 3:00 PM IST
క‌న‌క‌వ‌తి ద‌య‌, ధైర్యంతో లొంగ‌దీసుకుంటుంది!
X

క‌న్న‌డ బ్యూటీ రుక్మిణీ వ‌సంత్ ఇప్పుడో సంచ‌ల‌నం. వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలకు క‌మిట్ అవ్వ‌డంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ లో చేసింది ఒక్క సినిమా అయినా? నేచుర‌ల్ బ్యూటీ క‌నెక్ట్ వైనం సంథింగ్ స్పెష‌ల్. అమ్మ‌డికి తెలుగింట‌ అప్పుడే ఫాలోయింగ్ అంత‌కంత‌కు పెరుగుతుంది. `కాంతార చాప్ట‌ర్ వ‌న్` హిట్ అయితే? ఆ ఫాలోయింగ్ పీక్స్ కు చేరుతుంది. ఈ సినిమాపై తెలుగు ఆడియ‌న్స్ లో భారీ అంచ‌నాలున్న సంగ‌తి తెలిసిందే. క‌న్న‌డ త‌ర్వాత తెలుగులోనే ఆ రేంజ్ లో అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుటుంది.

గొప్ప పాత్ర‌ల్లో క‌న‌క‌వ‌క‌తి ఒకరు:

యువ‌రాణి క‌న‌క‌వ‌తి పాత్ర‌లో రుక్మిణీ వ‌సంత్ ఆహార్యం ఆక‌ట్టుకుంటుంది. తాజాగా ఆ పాత్ర‌ను ఆడియన్స్ కు మ‌రింత క‌నెక్ట్ చేసేలా రుక్మిణీ వ‌సంత్ మ‌రిన్ని వివ‌రాలు రివీల్ చేసింది. త‌న కెరీర్ లోనే ప్ర‌త్యేకంగా నిలిచిపోయే పాత్ర‌ల్లో క‌న‌క‌వ‌తి పాత్ర ఒక‌టిగా నిల‌స్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేసింది. మ‌న జాన ప‌ద క‌ళ‌ల‌ను ముందుకు తీసుకెళ్లే అద్భత మైన చిత్రంగా కొనియాడింది. `క‌న‌క‌వ‌తి రాజ‌వంశానికి చెందిన అమ్మాయి. కానీ ఆమెలో ఇసుమెత్తు కూడా గ‌ర్వం అనేది ఎక్క‌డా క‌నిపించ‌దు. ఎంతో సున్నిత‌మైన పాత్ర అది. క‌న‌క‌వ‌తిలో ఉన్న ద‌య‌, దైర్యం చూసి ఎవ‌రైనా లొంగిపోవాల్సిందే.

ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతి:

యువ‌రాణి పాత్ర‌లో కాస్తైనా పొగ‌రుత‌నం క‌నిపిస్తుంది. కానీ ఈ యువ‌రాణి మాత్రం అందుకు భిన్నంగా తెర‌పై క‌నిపిస్తుంది. యువ‌రాణులు ఇలా కూడా ఉంటారా? అన్నంత కొత్త‌గా మ‌లిచారు. సినిమాలో ప్ర‌తీ స‌న్నివేశం ఎంతో అందంగా ఉంటుంది. ప్రేక్ష‌కులు సినిమా చూస్తున్నంత సేపు ఓ కొత్త అనుభూతికి లోన‌వుతారంది. మొత్తానికి రుక్మిణి అనుకున్న‌ది అనుకున్న‌ట్లు జ‌రిగితే? ఆమె పేరు అలియాస్ క‌న‌క‌వ‌తిగా మారిపోవ‌డం ఖాయం. ఈ సినిమాతో పాటు అమ్మ‌డు మ‌రిన్ని పాన్ ఇండియా సినిమాల‌తో బిజీగా ఉంది.

వ‌రుస‌గా పాన్ ఇండియా చిత్రాలు:

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తోన్న 'డ్రాగ‌న్' లో న‌టిస్తోంది. ఎంతో మంది హీరోయిన్లు ఉన్నా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ రుక్మిణిని ఎంపిక చేయ‌డం విశేషం.అలాగే య‌శ్ హీరోగా న‌టిస్తోన్న 'టాక్సిక్' లోనూ న‌టిస్తోంది. ఇలా వ‌రుస‌గా మూ డు పాన్ ఇండియా సినిమాల్లో న‌టించ‌డంతో? రుక్మిణీ వ‌సంత్ పేరు అంత‌టా సంచ‌ల‌నంగా మారింది. రుక్మిణి క‌న్న‌డిగా కావ‌డంతోనే ఇన్ని అవ‌కాశాలు వ‌చ్చాయి? అన్న‌ది కాద‌న‌లేని వాస్త‌వంగానూ క‌నిపిస్తోంది.