కలలోనూ ఊహించలేదు.. తారక్ మూవీ కోసం ఇప్పుడే చెప్పను: రుక్మిణీ
ఇప్పుడు అక్టోబర్ 2వ తేదీన కాంతార చాప్టర్ 1తో సందడి చేయనున్న అమ్మడు.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: M Prashanth | 28 Sept 2025 3:00 PM ISTరుక్మిణీ వసంత్.. నిన్న మొన్నటి వరకు కన్నడ సినీ ఇండస్ట్రీలో ఈ పేరు ఫుల్ గా వినిపించింది. అక్కడ తీసిన సప్త సాగరాలు దాటి సిరీస్ చిత్రాలతోపాటు బఘీర వంటి సినిమాలతో ఆమె మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. పలు సినిమాల్లో నటిస్తున్నారు.
రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ లీడ్ రోల్ లో తెరకెక్కిన మదరాసితో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన రుక్మిణీ.. తన యాక్టింగ్ తో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు అక్టోబర్ 2వ తేదీన కాంతార చాప్టర్ 1తో సందడి చేయనున్న అమ్మడు.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ముందుగా కాంతార ప్రీక్వెల్ మూవీ ఛాన్స్ కోసం మాట్లాడారు. తాను నటించిన సప్తసాగరాలు దాటి, ఏస్ మూవీలను రిషబ్ శెట్టి చూశారని, ప్రీమియర్స్ కు వచ్చి తన నటనను మెచ్చుకున్నారని తెలిపారు. కాంతార చాప్టర్ 1లో యాక్ట్ చేసే అవకాశం తనకు వస్తుందని కలలో కూడా ఊహించలేదని చెప్పుకొచ్చారు రుక్మిణీ వసంత్.
ఆయన తన సినిమాల ప్రీమియర్స్ చూసి ఛాన్స్ ఇచ్చారని భావిస్తున్నట్లు చెప్పారు. కాంతార టీమ్ తన ఫోన్ చేసి ఇందులో యాక్ట్ చేస్తారా అని అడిగినప్పుడు అప్పుడు వచ్చిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని తెలిపారు. కాంతార ప్రీక్వెల్ 4,5 శతాబ్దాల మధ్య జరిగే కథ అని, అప్పటి పరిస్థితులకు తగినట్లు నటించాలని రుక్మిణీ వసంత్ చెప్పారు.
సినిమా కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధంలో శిక్షణ పొందడం ఎంతో సరదాగా అనిపించిందని, తాను మూవీలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు చేశానని చెప్పారు. షూటింగ్ టైమ్ లో రిషబ్ శెట్టిని చూసి కొన్నిసార్లు షాక్ అయినట్లు తెలిపారు. హీరో, డైరెక్టర్ గా ఆయన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారని ప్రశంసల వర్షం కురిపించారు.
ఆ తర్వాత తాను ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న సినిమా, యశ్ టాక్సిక్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేనని అన్నారు. కెరీర్ లో ఏ ఆఫర్ కూడా వదులుకోలేనని చెప్పారు. ఫ్యూచర్ లో రకరకాల క్యారెక్టర్స్ చేస్తానని, ఆడియన్స్ తన జర్నీ జడ్జ్ చేయాలని తెలిపారు. ఫ్యాన్స్ అంతా క్రష్ అంటున్నారని, లేబుల్స్ మాత్రం నార్మల్ అని తెలిపారు. వాళ్లంతా తన క్యారెక్టర్ కు కనెక్ట్ అవ్వడం హ్యాపీ అని చెప్పారు.
