కన్నడ భామ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్టు
బీర్బల్ మూవీతో కెరీర్ ను స్టార్ట్ చేసిన రుక్మిణి వసంత్, సప్త సాగరాలు దాటి సైడ్ ఎ, సైడ్ బి సినిమాలతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 18 Aug 2025 5:00 PM ISTబీర్బల్ మూవీతో కెరీర్ ను స్టార్ట్ చేసిన రుక్మిణి వసంత్, సప్త సాగరాలు దాటి సైడ్ ఎ, సైడ్ బి సినిమాలతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం కన్నడ, తమిళ, తెలుగు భాషల్లో నటిస్తూ భారీ డిమాండ్ ఉన్న టాలెంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా రుక్మిణి ఎదిగారు. విజయ్ సేతుపతి సరసన ఏస్ సినిమాలో నటించి కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రుక్మిణి రీసెంట్ గానే కాంతార చాప్టర్1 షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
కాంతార1 తో పాటూ శివ కార్తికేయన్ తో కలిసి రుక్మిణి ఓ సినిమా చేస్తున్నారు. అది కాకుండా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా రుక్మిణి హీరోయిన్ గా నటించనున్నారు. అయితే ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టులో రుక్మిణి చోటు దక్కించుకుందనే విషయం ఆమెను మరోసారి వార్తల్లో నిలిపింది.
పలు భాషలకు చెందిన స్టార్లు
అదే యష్ హీరోగా వస్తోన్న టాక్సిక్. కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాల తర్వాత యష్ చేస్తున్న సినిమానే టాక్సిక్. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. టాక్సిక్ కోసం ఇప్పటికే పలు భాషల నుంచి స్టార్లను తీసుకోగా ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి రుక్మిణి కూడా తోడైనట్టు తెలుస్తోంది. కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా లాంటి భారీ తారాగణంతో పాటూ రుక్మిణి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
టాక్సిక్ లో రుక్మిణి నటిస్తుందనే విషయాన్ని మేకర్స్ ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయకపోయినప్పటికీ ఇప్పటికే ఈ సినిమా కోసం రుక్మిణి పలు షెడ్యూళ్ల షూటింగ్ ను కూడా పూర్తి చేశారని శాండిల్‌వుడ్ వర్గాల నుంచి లీకులందుతున్నాయి. ఇంగ్లీష్, కన్నడ భాషల్లో సమాంతరంగా తెరకెక్కుతున్న టాక్సిక్ సినిమా వచ్చే ఏడాది మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
