గ్లామర్ డోస్ ఓవర్‌లోడ్.. రెడ్ డ్రెస్‌లో రుక్మిణి వసంత్ కిల్లింగ్ స్టిల్స్!
కన్నడ క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
By: Madhu Reddy | 25 Aug 2026 3:36 PM ISTకన్నడ క్యూట్ బ్యూటీ రుక్మిణి వసంత్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చెన్నైలో జరిగిన ఒక ఈవెంట్‌లో పాల్గొన్న ఈ భామ, అక్కడ అభిమానుల నుంచి లభించిన అపారమైన ప్రేమకు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ క్షణాలను గుర్తుచేసుకుంటూ 'డ్యాష్ అండ్ డాట్' బ్రాండ్‌కు చెందిన రెడ్ డ్రెస్‌లో దిగిన కిల్లర్ పిక్స్‌ను ఇన్స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు..
చెన్నై ఈవెంట్‌లో ఎమోషనల్.. రెడ్ డ్రెస్‌లో రచ్చ:
"చెన్నై.. నిన్నటి తీపి జ్ఞాపకాల నుంచి నేను ఇంకా బయటకు రాలేకపోతున్నాను. నిన్న స్టేజ్ పైకి వెళ్లినప్పుడు మీరు చూపించిన ప్రేమ నన్ను ఎంతగానో మురిపించింది. నిజంగా చాలా కృతజ్ఞురాలిని" అంటూ రుక్మిణి ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన 'క్రిమ్సన్ రెడ్ టై-అప్' హై-లో మ్యాక్సీ డ్రెస్, దాని బ్యాక్ కటౌట్ డిజైన్ ఆమె గ్లామర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి.
'సప్త సాగరదాచే ఎల్లో' నుంచి క్రేజీ ప్రాజెక్టుల వరకు:
ఇక 2019లో 'బీర్బల్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన రుక్మిణి వసంత్, 'సప్త సాగరదాచే ఎల్లో' పార్ట్-A, పార్ట్-B సినిమాలతో భారీ పాపులారిటీ సాధించారు. ఈ చిత్రానికి గానూ ఫిలింఫేర్ క్రిటిక్స్ బెస్ట్ నటి అవార్డును కూడా గెలుచుకున్నారు. ఆ తర్వాత 'బాణదారియల్లి', 'బఘీర', 'భైరతి రణగల్' వంటి చిత్రాలతో అలరించారు. 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'తో తెలుగులోకి, 'ఏస్', 'మాధరాసి' చిత్రాలతో తమిళంలోకి, అల్టిమేట్ హిట్ 'కాంతార: చాప్టర్ 1'తో పాన్ ఇండియా స్థాయిలో మెప్పించారు.
బిజీ షెడ్యూల్.. ఎన్టీఆర్, యష్ సినిమాల్లో;
ప్రస్తుతం రుక్మిణి వసంత్ టాలీవుడ్, శాండల్‌వుడ్ ఇండస్ట్రీలలో క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతున్నారు. రాకింగ్ స్టార్ యష్ సరసన నటిస్తున్న భారీ చిత్రం 'టాక్సిక్' త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుండగా, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' చిత్రంలో కూడా ఈమె కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా 'NP51' చిత్రంతో మలయాళంలోకి కూడా అడుగుపెడుతున్నారు.
కుర్రాళ్ల కలల రాణి:
తన సహజమైన అభినయంతో, క్యూట్ లుక్స్‌తో సౌత్ ఇండియాలో వరుస అవకాశాలు అందుకని స్టార్ హీరోయిన్‌గా మారుతున్నారు రుక్మిణి వసంత్. తాజాగా ఆమె పంచుకున్న ఈ రెడ్ డ్రెస్ కిల్లింగ్ స్టిల్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచాయి..
