Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ మూవీతో రుక్మిణి సెంటిమెంట్‌ బ్రేక్‌ అయ్యేనా?

ప్రస్తుతం కన్నడంలో కాంతార : చాప్టర్ 1 సినిమాతో పాటు, టాక్సిక్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు కన్నడ సినిమాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్నాయి.

By:  Ramesh Palla   |   11 Sept 2025 3:00 PM IST
ఎన్టీఆర్‌ మూవీతో రుక్మిణి సెంటిమెంట్‌ బ్రేక్‌ అయ్యేనా?
X

కన్నడ మూవీ 'సప్త సాగరదాచే ఎల్లో' తో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ రుక్మిణి వసంత్‌. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపుతో రుక్మిణి పలు కన్నడ సినిమాల్లో నటించిన విషయం తెల్సిందే. అదే సమయంలో తెలుగులో 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాలో నటించింది. కన్నడంలో హిట్‌ సొంతం చేసుకున్న రుక్మిణి వసంత్‌ తెలుగులో మొదటి సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో తో నిరాశ పరిచింది. టాలీవుడ్‌లో ఈ అమ్మడికి మొదటి సినిమాతోనే ఫ్లాప్‌ పడింది. ఈ ఏడాది తమిళ్‌లోనూ రుక్మిణి వసంత్‌ ఎంట్రీ ఇచ్చింది. కోలీవుడ్‌లో ఏస్‌, మధరాసి సినిమాలతో రుక్మిణి వసంత్‌ ఎంట్రీ ఇచ్చింది. రెండు సినిమాలు ఈమెకు నిరాశనే మిగిల్చాయి. సౌత్‌లో తక్కువ సమయంలోనే మూడు భాషల్లోనూ నటించే అవకాశాలు వచ్చినప్పటికీ ఈ అమ్మడికి లక్‌ కలిసి రాకపోవడంతో నిరాశే మిగిలింది.

కాంతార సినిమాలో రుక్మిణి వసంత్‌

ప్రస్తుతం కన్నడంలో కాంతార : చాప్టర్ 1 సినిమాతో పాటు, టాక్సిక్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ రెండు కన్నడ సినిమాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్నాయి. రెండు సినిమాలపై ఉన్న అంచనాల నేపథ్యంలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన చివరి దశ వర్క్ జరుగుతోంది. ఈ రెండు కన్నడ సినిమాలతో రుక్మిణి మరోసారి తన ఖాతాలో భారీ విజయాలను వేసుకోవడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఈ రెండు సినిమాలతో పాటు ఎన్టీఆర్‌ కు జోడీగా ఒక సినిమాలో ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగులో రుక్మిణి చేస్తున్న రెండో సినిమా ఇది. మొదటి సినిమా ఫ్లాప్‌ అయినా ఇది ఎన్టీఆర్‌తో మూవీ కనుక అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఉంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాపై భారీ అంచనాలు

కేజీఎఫ్‌, సలార్‌ మేకర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతున్న క్రేజీ పాన్‌ ఇండియా మూవీ 'డ్రాగన్‌' లో హీరోయిన్‌గా రుక్మిణి నటిస్తున్న నేపథ్యంలో ఆమె క్రేజ్ ఇప్పటికే పెరిగింది. టాలీవుడ్‌లో డ్రాగన్‌ విడుదలకు ముందే మరిన్ని సినిమాలను చేసే అవకాశాలు దక్కించుకునే అవకాశం ఉంది. కానీ డ్రాగన్‌ సినిమా విడుదల తర్వాతే తెలుగులో ఈమె సినిమాలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకు రుక్మిణి తెలుగు లో కొత్త సినిమాలకు ఓకే చెప్పలేదు. వచ్చే ఏడాది సమ్మర్‌ తర్వాత ఎన్టీఆర్‌ డ్రాగన్ సినిమా విడుదల కాబోతుంది. ప్రశాంత్‌ నీల్‌ సినిమా అంటే హీరోయిన్స్‌కు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు అంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం రుక్మిణి వసంత్‌ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అంటున్నారు.

యశ్‌ టాక్సిక్ సినిమాతోనూ రానున్న రుక్మిణి

రుక్మిణి అదృష్టం కొద్ది ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న మూడు సినిమాలు కూడా అత్యంత క్రేజీ ప్రాజెక్ట్‌లు కావడం విశేషం. మూడు పాన్‌ ఇండియా సినిమాల్లో ఒకేసారి నటిస్తున్న కారణంగా రాబోయే రోజుల్లో రుక్మిణి స్టార్‌ హీరోయిన్‌గా పాన్‌ ఇండియా రేంజ్‌లో వరుస సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అంటూ ఇప్పటికే ప్రేక్షకులతో నమ్మకం ఏర్పడింది. మూడు సినిమాల్లో రెండు కన్నడ మూవీస్‌ అయినప్పటికీ పాన్‌ ఇండియా రేంజ్‌లో వాటికి క్రేజ్ ఉన్న కారణంగా అన్ని భాషల్లోనూ రుక్మిణి వసంత్‌కి మంచి ఆధరణ దక్కే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో, తమిళ్‌లో మొదటి సినిమాతో ఫ్లాప్‌ ను చవి చూసిన రుక్మిణి వసంత్‌ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో చేస్తున్న డ్రాగన్‌ సినిమాతో అయినా ఫ్లాప్‌ సెంటిమెంట్‌ బ్రేక్ అవుతుందా అనేది చూడాలి.