Begin typing your search above and press return to search.

కాంతార 2 తెచ్చిన అదృష్టం.. అక్కడ కూడా కలిసొస్తుందా?

కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె అక్కడే పలు చిత్రాలలో నటించి.. తెలుగులో హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

By:  Madhu Reddy   |   15 Dec 2025 12:00 PM IST
కాంతార 2 తెచ్చిన అదృష్టం.. అక్కడ కూడా కలిసొస్తుందా?
X

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో చెప్పడం అసాధ్యం. కొంతమంది ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళ తరబడి సినిమాలు చేస్తున్నా.. రాణి అదృష్టం.. ఇంకొంతమందికి ఒకటి రెండు చిత్రాలతోనే కాదు ఓవర్ నైట్ లోనే వారికి స్టార్ స్టేటస్ లభిస్తూ ఉంటుంది.. ఇంకొంతమందికి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఏకంగా పాన్ ఇండియా స్టేటస్ లభించడమే కాకుండా వారికి అన్ని భాష ఇండస్ట్రీలు కూడా పెద్దపీట వేస్తాయనడంలో సందేహం లేదు.ఇకపోతే అలా ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకొని అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది రుక్మిణి వసంత్.

కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె అక్కడే పలు చిత్రాలలో నటించి.. తెలుగులో హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇటీవల శివ కార్తికేయన్ తో మదరాసి అనే సినిమా చేసింది కానీ ఇది కూడా పెద్దగా మెప్పించలేదు. తర్వాత ప్రముఖ కన్నడ స్టార్ హీరో కం డైరెక్టర్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కాంతార సినిమా ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 2 రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కనకావతి పాత్రలో తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది. యువరాణి పాత్రలో ఒదిగిపోయిన రుక్మిణి వసంత్.. కొన్ని సన్నివేశాలలో హీరో రిషబ్ శెట్టిని కూడా నటనలో డామినేట్ చేసింది అంటే.. ఇక తన నటనతో ఆమె ఏ రేంజ్ లో ఆడియన్స్ ను మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు.

అలాంటి ఈమె ప్రస్తుతం ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మరో పాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది రుక్మిణి వసంత్. ఏకంగా బాలీవుడ్ కి పయనం అవుతోంది.అసలు విషయంలోకి వెళ్తే కాంతార 2 సినిమాతో భారీ అదృష్టాన్ని, పాపులారిటీని సొంతం చేసుకున్న రుక్మిణి వసంత్ ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రుక్మిణి వసంత్ మాట్లాడుతూ.." హిందీ నాకు చిన్నప్పటి నుంచి సుపరిచితమే. బాలీవుడ్ లో కూడా మూవీ గురించి చర్చలు జరుగుతున్నాయి. దేవుడి దయతో త్వరలోనే ఆ పనిని కూడా ప్రారంభిస్తానని అనుకుంటున్నాను" అంటూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే బాలీవుడ్ లోకి తొలి అడుగు వేయబోతున్న రుక్మిణి వసంత్ కి సౌత్ ఇండస్ట్రీలో లాగే బాలీవుడ్ లో కూడా అదృష్టం వరిస్తుందా ? అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఒకవేళ ఈమె నటించబోయే తొలి బాలీవుడ్ సినిమా కూడా విజయం సాధించింది అంటే ఇక అమ్మడి రేంజ్ భారీగా పెరిగిపోతుందనడంలో సందేహం లేదు. అంతేకాదు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ జాబితాలోకి కూడా చేరిపోతుంది అని అభిమానులు కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. మరి రుక్మిణి వసంత్ అదృష్టం ఎలా ఉండనుందో తెలియాలి అంటే ఆ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు సినిమా ఫలితం కోసం కూడా ఎదురు చూడాల్సిందే.