Begin typing your search above and press return to search.

రుక్మిణీ ప్రేమలో పడిందా? నిజమేనా?

యంగ్ హీరోయిన్ రుక్మిణీ వసంత్ గురించి అందరికీ తెలిసిందే. తక్కువ టైమ్ లోనే ఎక్కువ గుర్తింపు ఆమె సొంతమవ్వగా.. వివిధ సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు.

By:  M Prashanth   |   17 Jan 2026 10:57 PM IST
రుక్మిణీ ప్రేమలో పడిందా? నిజమేనా?
X

యంగ్ హీరోయిన్ రుక్మిణీ వసంత్ గురించి అందరికీ తెలిసిందే. తక్కువ టైమ్ లోనే ఎక్కువ గుర్తింపు ఆమె సొంతమవ్వగా.. వివిధ సినిమాలతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆయా చిత్రాల్లో తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించి స్పెషల్ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు రుక్మిణీ వసంత్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన గాసిప్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఆమె తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సిద్ధాంత్‌ తో డేటింగ్‌ లో ఉన్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిద్ధాంత్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌ కాగా.. ఇద్దరూ చాలా కాలంగా మంచి స్నేహితులని నెటిజన్లు చెబుతున్నారు. తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న ఓల్డ్ ఫోటోలు ఇన్‌ స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్నాయి. దీంతో డేటింగ్ రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఆ విషయంపై రుక్మిణి రెస్పాండ్ అవ్వలేదు.

అంతేకాదు.. ఆమె తన రూమర్డ్ బాయ్‌ ఫ్రెండ్‌ తో కలిసి ఎక్కడా కనపడలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే రుక్మిణీ వసంత్ డేటింగ్ వార్తల్లో ఎంత నిజమెందో ఎవరికీ తెలియదు. అయితే ఇటీవల కాలంలో సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కొన్ని సందర్భాల్లో అవి నిజమవుతున్నప్పటికీ, మరికొన్ని సార్లు పూర్తిగా రూమర్స్ గా తేలిపోతున్నాయి.

ఇప్పుడు రుక్మిణి వసంత్ విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అఫీషియల్ గా రెస్పాన్స్ లేకపోవడంతో డేటింగ్ రూమర్లు నిజమా? కాదా? అన్నది వేచి చూడాల్సిందే. అయితే కెరీర్ పరంగా మంచి దశలో ఉన్న రుక్మిణి వసంత్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన డేటింగ్ వార్తలు ప్రస్తుతం మాత్రం ఊహాగానాలకే పరిమితమయ్యాయి.

ఇక రుక్మిణి కెరీర్ విషయానికి వస్తే, బీర్బల్ ట్రైలాజీ చిత్రంతో ఆమె సిల్వర్ స్క్రీన్ కు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే తన నేచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమెకు అసలైన బ్రేక్ మాత్రం సప్త సాగరాలు దాటితో లభించింది. ఆ చిత్రంలో బ్యూటీ యాక్టింగ్ కు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఆ తర్వాత కాంతార సినిమాలో కీలక పాత్రలో కనిపించి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ సినిమా విజయంతో రుక్మిణి పేరు దక్షిణాదికే కాకుండా పాన్ ఇండియా లెవెల్ లో కూడా వినిపించింది. ఇప్పుడు రుక్మిణి వసంత్ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌ లో రూపొందుతున్న సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న టాక్సిక్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఆ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.