Begin typing your search above and press return to search.

ప్ర‌తి స్టెప్ వెనుక శ్రీ‌వారే.. గోవింద గోవింద‌.. న‌టి ప్రార్థ‌న‌

రుహానీ శర్మ ఇప్పటికే హిందీలో అడుగుపెట్టారు. ఆగ్రా అనే చిత్రంలో త‌న న‌ట‌న‌కు పేరొచ్చింది. ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శిత‌మైంది.

By:  Sivaji Kontham   |   21 Feb 2026 11:40 PM IST
ప్ర‌తి స్టెప్ వెనుక శ్రీ‌వారే.. గోవింద గోవింద‌.. న‌టి ప్రార్థ‌న‌
X

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ వ్యాలీ (సిమ్లా సమీపంలో) నుండి వచ్చిన రుహానీ శర్మ తన అద్భుతమైన నటన, హుందాతనంతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల ఈ బ్యూటీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. ఈ ఫోటోగ్రాఫ్స్ కి ``ప్రతి అడుగు వెనుక ఆయన కృప ఉంది`` అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నంలో రుహానీ ఎంతో ట్రెడిష‌న‌ల్ దుస్తుల్లో క‌నిపించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్‌స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారాయి.

రుహానీ శర్మ నటించిన తెలుగు సినిమాలలో చిలసౌ త‌న‌కు న‌టిగా మంచి పేరు తెచ్చింది. ఇది రుహానీ తొలి తెలుగు సినిమా. ఇందులో అంజలి పాత్రలో నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. త‌ర్వాత హిట్: ద ఫస్ట్ కేస్ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన ఫోరెన్సిక్ ఆఫీసర్‌గా నటించారు. ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో వచ్చిన బోల్డ్ అండ్ క్లాసిక్ డ్రామా `డ‌ర్టీ హ‌రి`లో ఓ కీల‌క పాత్ర‌లో రుహానీ న‌టించి మెప్పించింది. `నూటొక్క జిల్లాల అందగాడు`లో అవసరాల శ్రీనివాస్ సరసన నటించింది. వెంకటేష్ నటించిన మైలురాయి చిత్రం సైంధ‌వ్‌లో ఒక కీలక పాత్ర (డాక్టర్) పోషించారు. శ్రీరంగనీతులు అనే చిత్రంలోని న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు కురిసాయి.

త‌దుపరి చిత్రాల వివరాలు:

2023లో `హర్` చాప్ట‌ర్ 2 లో రుహానీ ప్రధాన పాత్రలో నటించింది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో రూపొందింది. ప్ర‌స్తుతం ప్రాజెక్టుల ప‌రంగా అంత దూకుడు లేదు. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఆమె వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆల్క‌హాల్ అనే తెలుగు చిత్రంలోను న‌టిస్తోంది.

బాలీవుడ్ లో..

రుహానీ శర్మ ఇప్పటికే హిందీలో అడుగుపెట్టారు. ఆగ్రా అనే చిత్రంలో త‌న న‌ట‌న‌కు పేరొచ్చింది. ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శిత‌మైంది. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్‌లు, హిందీ ప్రాజెక్టుల కోసం రుహానీ చర్చలు జరుపుతున్నారు. బాలీవుడ్‌లో మరింత గుర్తింపు తెచ్చుకోవడానికి మంచి స్క్రిప్ట్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.

రుహానీ శర్మ తన ప్రతిభతో కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకున్నారు.