Begin typing your search above and press return to search.

రుహాని హాట్ మిర్రర్ సెల్ఫీలు.. సోషల్ మీడియాలో వైరల్

'చిలసౌ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ భామ, తాజాగా పోస్ట్ చేసిన మిర్రర్ సెల్ఫీలు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

By:  Madhu Reddy   |   19 April 2026 2:00 PM IST
రుహాని హాట్ మిర్రర్ సెల్ఫీలు.. సోషల్ మీడియాలో వైరల్
X

హిమాచల్ ప్రదేశ్ అందం రుహాని శర్మ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. 'చిలసౌ' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ భామ, తాజాగా పోస్ట్ చేసిన మిర్రర్ సెల్ఫీలు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. నటనతోనే కాదు, తన గ్లామర్‌తోనూ మెప్పించగలనని రుహాని నిరూపిస్తోంది. సినిమాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలపై ఓ లుక్కేయండి.




హిమాచల్ నుంచి వెండితెర వరకు:

రుహాని శర్మ ప్రయాణం 2017లో మొదలైంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఈ సొగసరి తెలుగు, తమిళం, మలయాళం మరియు హిందీ భాషల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. చూడగానే పక్కింటి అమ్మాయిలా కనిపించే రుహాని, తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇక మొదట్లో చాలా పద్ధతైన పాత్రలు చేసినప్పటికీ, కాలక్రమేణా గ్లామర్ డోస్ పెంచుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఈమె నిరంతరం శ్రమిస్తూనే ఉంది.

హిట్ ఇచ్చిన ఊపు.. కెరీర్ మలుపు:

రుహాని కెరీర్‌లో మైలురాయి అంటే హిట్: ది ఫస్ట్ కేస్ ' (2020) అని చెప్పాలి. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఘనవిజయం సాధించడంతో పాటు రుహానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతకుముందు 'చిలసౌ'తో డీసెంట్ హిట్ అందుకున్న ఈమెకు 'హిట్' సినిమా ఒక కమర్షియల్ బ్రేక్ ఇచ్చింది. అయితే, ఆ తర్వాత చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేకపోయాయి. ఇక టాలెంట్ ఉన్నప్పటికీ, అదృష్టం కలిసి రాక కొన్ని చిత్రాలు సైలెంట్‌గా వచ్చి వెళ్ళిపోయాయి. అయినప్పటికీ రుహాని మాత్రం ఏమాత్రం తగ్గకుండా వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది.

మిర్రర్ సెల్ఫీలతో షేక్ చేస్తున్న భామ:

సినిమా ఫలితాలు ఎలా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం రుహాని ఒక రేంజ్‌లో దూసుకుపోతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన మిర్రర్ సెల్ఫీలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. ట్రెండీ అవుట్‌ఫిట్స్‌లో తన పర్ఫెక్ట్ బాడీని చూపిస్తూ కుర్రకారును కట్టిపడేస్తోంది. "స్టైల్ అంటే నాదే" అన్నట్టుగా ఉన్న ఆమె ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఇక కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం కాకుండా, ఫోటోగ్రఫీలో తనకున్న టేస్ట్‌ను కూడా ఈ ఫోటోల ద్వారా చూపిస్తోంది. దీంతో నెటిజన్లు రకరకాల కామెంట్లతో రుహానిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

సరైన సక్సెస్ కోసం ఎదురుచూపులు:

నటిగా తనని తాను ప్రూవ్ చేసుకున్న రుహానికి ఇప్పుడు కావాల్సింది ఒక భారీ కమర్షియల్ సక్సెస్. వరుసగా సినిమాలు చేస్తూ, వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ తన పరిధిని విస్తరించుకుంటోంది. గ్లామర్ అండ్ పెర్ఫార్మెన్స్ రెండూ ఉన్న ఈ భామకు ఒక సరైన పడాలి కానీ, టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరడం ఖాయం. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ ఫాలోయింగ్ ఆమె తదుపరి సినిమాలకు ప్లస్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏదేమైనా, రుహాని తన గ్లామర్ అండ్ టాలెంట్‌తో ట్రెండింగ్‌లో ఉండటం మాత్రం విశేషం.