Begin typing your search above and press return to search.

చిన్నారి నుంచి గ్లామ్ డాల్ వరకు! RRR మల్లి ట్రాన్స్‌ఫర్మేషన్ వైరల్

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ బ్లాక్‌బస్టర్ సినిమా 'RRR' గుర్తుంది కదా? ఆ సినిమాలో కథ మొత్తాన్ని మలుపు తిప్పే అమాయకపు గిరిజన చిన్నారి 'మల్లి' క్యారెక్టర్‌ను ఎవరూ మర్చిపోలేరు.

By:  Madhu Reddy   |   18 Jun 2026 2:53 PM IST
చిన్నారి నుంచి గ్లామ్ డాల్ వరకు! RRR మల్లి ట్రాన్స్‌ఫర్మేషన్ వైరల్
X

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన గ్లోబల్ బ్లాక్‌బస్టర్ సినిమా 'RRR' గుర్తుంది కదా? ఆ సినిమాలో కథ మొత్తాన్ని మలుపు తిప్పే అమాయకపు గిరిజన చిన్నారి 'మల్లి' క్యారెక్టర్‌ను ఎవరూ మర్చిపోలేరు. ఆ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ట్వింకిల్ శర్మ. అప్పట్లో ఎంతో హోమ్లీగా, చిన్నపిల్లలా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అమాంతం పెరిగి పెద్దదైపోయి, తన గ్లామరస్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో సోషల్ మీడియాను ఒక్కసారిగా షేక్ చేస్తోంది. ఆ వివరాలు చూద్దాం..





RRR కథను నడిపించిన ఎమోషనల్ బ్యాక్‌బోన్:

హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ ప్రాంతానికి చెందిన ట్వింకిల్ శర్మ చాలా చిన్న వయసులోనే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. కేవలం రెండేళ్ల వయసు నుంచే డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్న ఈమె, RRR సినిమాలో మల్లి పాత్రలో తన కళ్లెక్స్‌ప్రెషన్స్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక సినిమాలో ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ ప్రాణాలకు తెగించి పోరాడటానికి, సినిమా కథ అంత పెద్ద రేంజ్‌కు వెళ్లడానికి ఆ చిన్నారే అసలైన లించ్ పిన్.





బ్లాక్ ఫ్లోరల్ డ్రెస్‌లో గ్లామరస్ లుక్:

తాజాగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఫొటోషూట్‌లో ట్వింకిల్ శర్మ లుక్ చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌పై పెద్ద పెద్ద గులాబీ పువ్వుల ప్రింట్లు ఉన్న డార్క్ ఫ్లోరల్ బాడీకాన్ స్లిప్ డ్రెస్ ధరించి ఆమె మెరిసిపోయింది. ఇక సన్నటి స్పఘెట్టి షోల్డర్ స్ట్రాప్స్, ఫిట్టెడ్ బోడిస్‌తో ఉన్న ఈ మోడరన్ అవుట్‌ఫిట్‌లో ట్వింకిల్ చాలా ఎలిగెంట్‌గా, స్టైలిష్ గ్లామ్ డాల్‌లా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.





దృశ్యం పాపలాగే రూట్ మార్చిన ‘మల్లి’:

ఇక ఈ చిన్నది అందమైన వెదురు ఆర్చ్ వెలుతురులో నిలబడి చాలా కాన్ఫిడెంట్‌గా పోజులిచ్చింది. ఫ్లోరల్ స్లీవ్‌లెస్ టాప్, డెనిమ్ మినీ స్కర్ట్‌తో ఉన్న ఆమె లేటెస్ట్ గ్లామరస్ పిక్స్ చూస్తుంటే.. అప్పట్లో ‘దృశ్యం’ సినిమాలో చిన్నపిల్లగా నటించి, ఇప్పుడు హీరోయిన్ రేంజ్‌లో మెరిసిపోతున్న ఎస్తేర్ అనిల్, బేబీ షామిలి, గుర్తుకు వస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అప్పటి అమాయకపు మల్లి ఇదా అంటూ ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు.

ట్వింకిల్ శర్మ చైల్డ్ ఆర్టిస్ట్ స్టేజ్ నుంచి హీరోయిన్ మెటీరియల్‌గా మారిన విధానం నిజంగానే ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ లుక్ చూశాక, టాలీవుడ్ మేకర్స్ కన్ను కూడా ఈ హిమాచల్ బ్యూటీపై పడటం ఖాయమనిపిస్తోంది. ఇక మరి రాబోయే రోజుల్లో ఈ 'RRR' మల్లి వెండితెరపై హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతుందో చూడాలి.