Begin typing your search above and press return to search.

అమెరికా, జపాన్‌లో తెలుగు సినిమా రచ్చ..!

స్టార్‌ హీరోల సినిమాలు, సూపర్ హిట్‌ సినిమాలు సైతం మూడు నాలుగు వారాల కంటే ఎక్కువ ఆడటం లేదు. ఇండియాలో ఒక సినిమా నెల రోజులు థియేటర్‌లో ఉండటం అంటే గొప్ప విషయంగా మారింది.

By:  Ramesh Palla   |   1 March 2026 6:00 PM IST
అమెరికా, జపాన్‌లో తెలుగు సినిమా రచ్చ..!
X

స్టార్‌ హీరోల సినిమాలు, సూపర్ హిట్‌ సినిమాలు సైతం మూడు నాలుగు వారాల కంటే ఎక్కువ ఆడటం లేదు. ఇండియాలో ఒక సినిమా నెల రోజులు థియేటర్‌లో ఉండటం అంటే గొప్ప విషయంగా మారింది. గడచిన పదేళ్ల కాలంలో ఎంత సూపర్‌ హిట్‌ సినిమా అయినా నాలుగు వారాల కంటే ఎక్కువగా థియేటర్‌లో ఉండటం లేదు. ఒకటి రెండు సినిమాలను అలా నడుపుతూ ఉన్నప్పటికీ జనాలు థియేటర్‌కి వస్తున్న దాఖలాలు లేవు. ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిన తర్వాత సినిమాను థియేటర్లో చూసేందుకు ఏ ఒక్కరూ ఆసక్తి చూపడం లేదు. కానీ అమెరికాలో మాత్రం ఓటీటీలో వచ్చినా థియేటర్‌లో చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్‌ ఎక్స్‌పీరియస్ చేయడం కోసం సినిమాను మళ్లీ మళ్లీ చూడటం ద్వారా అరుదైన రికార్డ్‌ను అమెరికన్‌ ప్రేక్షకులు ఆర్‌ఆర్‌ఆర్‌ కి అరుదైన రికార్డ్‌ ను కట్టబెట్టారు.

ఆర్ఆర్‌ఆర్‌ సినిమాతో...

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా ఏడాది కంటే ఎక్కువగానే అమెరికాలో స్క్రీనింగ్‌ అయింది. అక్కడ పలు చోట్ల ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కంటిన్యూగా స్క్రీనింగ్‌ అవుతూ వచ్చింది. ఓటీటీలో సినిమా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చాలా మంది థియేటర్‌లో చూసేందుకు వచ్చారంటూ అక్కడి డిస్ట్రిబ్యూటర్‌ చెప్పుకొచ్చాడు. ఒక సర్వేలో అమెరికాలో ఉన్న ఇండియన్‌ ప్రేక్షకుల్లో చాలా మంది ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను ఏకంగా నాలుగు ఐదు సార్లు చూశారట. అమెరికాలో ఒక నాన్‌ ఇంగ్లీష్ మూవీకి ఇంతగా ఆధరణ లభించడం ఎప్పుడూ జరగలేదు అని స్థానిక మీడియా సంస్థ ఒకటి తన కథనంలో పేర్కొంది. ఏడాదికి పైగా సినిమాను ఆడిస్తూనే వచ్చిన బయ్యర్లకు భారీ మొత్తంలో లాభాలు వచ్చినట్లు సమాచారం అందుతోంది.

అమెరికా, జపాన్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌...

అమెరికాతో పాటు జపాన్‌లో సైతం సినిమాకు మంచి స్పందన దక్కింది. జపాన్‌ లో దాదాపుగా రెండు ఏళ్ల పాటు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను చూస్తూనే ఉన్నారు. జపాన్‌ లోని ప్రేక్షకులు కొమురం భీమ్‌, రామరాజు పాత్రలకు సంబంధించిన గెటప్‌లు వేసుకుని మరీ థియేటర్‌కి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. అందుకే అక్కడ ఇప్పటికీ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇంగ్లీష్ సినిమాలు సైతం సాధించని వసూళ్లను ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా జపాన్‌లో రాబట్టిందని తెలుస్తోంది. జపాన్‌లో సినిమా ఆడటం మాత్రమే కాకుండా అక్కడ రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ లకు అభిమానులు ఏర్పడ్డారు. వారు ఇండియాకు వచ్చి మరీ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ లను కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో రజినీ కాంత్‌కి మాత్రమే ఈ స్థాయిలో రజనీకాంత్‌కి అభిమానులు ఉండేవారని అంటారు. ఇప్పుడు ఎన్టీఆర్‌, చరణ్‌, ప్రభాస్‌లకు అంతకు మించి అభిమానులు ఉన్నారు.

నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డ్‌...

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డ్‌ దక్కడంతో పాటు, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్‌లు ఇంకా చాలా అవార్డ్‌లు దక్కిన విషయం తెల్సిందే. అంతటి అవార్డ్‌లను దక్కించుకోవడం వల్ల సినిమాకు మంచి బజ్‌ క్రేజ్ దక్కింది. అందుకే సినిమా అంతర్జాతీయ స్థాయిలో అవార్డ్‌లు దక్కించుకుని, అక్కడ భారీ ఎత్తున కలెక్షన్స్‌ను దక్కించుకుంది. ప్రముఖ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అయింది. స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లోనూ భారీ ఎత్తున వ్యూస్‌ను దక్కించుకుని రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఇండియాలో కంటే ఈ సినిమాను విదేశాల్లో ఎక్కువగా ప్రేక్షకులు చూసినట్లుగా ఒక సర్వేలో వెల్లడి అయింది. ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో ఈ సినిమాను ప్రేక్షకులు థియేటర్‌లో, ఓటీటీలో తెగ చూసి ఎంజాయ్ చేశారు. అమెరికా, జపాన్‌లో ఈ సినిమా చేసిన రచ్చను ఇప్పట్లో మరే సినిమా బీట్‌ చేసే అవకాశాలు కూడా లేవని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.