Begin typing your search above and press return to search.

మ‌హాన‌టితో రౌడీ హీరో రొమాన్స్?

విజ‌య్ దేవ‌రకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నారు కానీ అవి ఆశించిన‌ట్టు హిట్ మాత్రం అవ‌డం లేదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   8 Oct 2025 1:46 PM IST
మ‌హాన‌టితో రౌడీ హీరో రొమాన్స్?
X

విజ‌య్ దేవ‌రకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలైతే చేస్తున్నారు కానీ అవి ఆశించిన‌ట్టు హిట్ మాత్రం అవ‌డం లేదు. భారీ అంచ‌నాలు పెట్టుకుని చేసిన ఖుషి, ఫ్యామిలీ స్టార్, కింగ్‌డ‌మ్ విజ‌య్ ను బాగా నిరాశ‌ప‌రిచాయి. దీంతో ఒక మంచి హిట్ కొట్టి సాలిడ్ కం బ్యాక్ ఇవ్వాల‌ని విజ‌య్ చాలా క‌సిగా ఉన్నారు. ప్ర‌స్తుతం విజ‌య్ చేతిలో రెండు సినిమాలున్నాయి.

ట్యాక్సీవాలా డైరెక్ట‌ర్ తో మ‌రోసారి..

అందులో ఒక‌టి ట్యాక్సీవాలా డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ లో చేస్తున్న సినిమా కాగా, రెండోది రౌడీ జ‌నార్థ‌న. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో రాజా వారు రాణి గారు ఫేమ్ ర‌వికిర‌ణ్ కోలా ఈ సినిమాను ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. మొద‌టి సినిమాను క్లాస్ గా తెర‌కెక్కించిన ర‌వి కిర‌ణ్ ఇప్పుడు ఈ సినిమాను యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అక్టోబ‌ర్ 11న రౌడీ జ‌నార్థ‌న‌

అయితే ఇప్పుడు రౌడీ జ‌నార్థ‌నకు సంబంధించి ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు అక్టోబ‌ర్ 11న జ‌ర‌గ‌నున్నాయ‌ని తెలుస్తోంది. ఆ త‌ర్వాత అక్టోబ‌ర్ 16 నుంచి ముంబై లో సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని స‌మాచారం. పూజ త‌ర్వాత మూడు నాలుగు రోజుల రెస్ట్ తీసుకుని అక్టోబ‌ర్ 16 నుంచి ముంబై లో రౌడీ జ‌నార్థ‌న ఫ‌స్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయ‌నున్నారట‌ మేక‌ర్స్.

విజ‌య్ స‌ర‌స‌న కీర్తి సురేష్

ఇదిలా ఉంటే ఈ సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న హీరోయిన్ గా కీర్తి సురేష్ న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. పెళ్లి త‌ర్వాత తెలుగు సినిమాల‌కు కాస్త బ్రేక్ ఇచ్చిన కీర్తి మ‌ళ్లీ వ‌రుసగా సినిమాల‌ను ఒప్పుకోవ‌డం మొద‌లుపెడుతుంద‌ని, అందులో భాగంగానే ఆల్రెడీ నాగ్ 100వ సినిమాకు కూడా సైన్ చేసింద‌ని అంటున్నారు. అయితే కీర్తి విష‌యంలో మేక‌ర్స్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.