Begin typing your search above and press return to search.

ఛలో మంగళూర్.. దేవరకొండ స్పీడ్ మామూలుగా లేదు..

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఒక సినిమా వర్క్ కంప్లీట్ అవ్వగానే మరో సినిమాకు షిఫ్ట్ అవుతూ తన షెడ్యూల్‌ ను పరుగులు పెట్టిస్తున్నారు.

By:  M Prashanth   |   23 Sept 2026 1:25 PM IST
ఛలో మంగళూర్.. దేవరకొండ స్పీడ్ మామూలుగా లేదు..
X

ఒక్క సినిమా పూర్తయిందంటే చాలు.. కాస్త రిలాక్స్ అవుదామనే ఆలోచన స్టార్ హీరో విజయ్ దేవరకొండకు ఉన్నట్లు కనిపించడం లేదు. ఇప్పుడిదే నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. రణబాలి మూవీ షూటింగ్, డబ్బింగ్ పూర్తి చేసిన వెంటనే మరో భారీ ప్రాజెక్ట్ సెట్స్‌ లోకి అడుగుపెట్టేశారు. రీసెంట్ గా హైదరాబాద్ నుంచి మంగళూరుకు వెళ్లిన రౌడీ హీరో.. రౌడీ జనార్దన కొత్త షెడ్యూల్‌ తో మళ్లీ బిజీ అయిపోయారు.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఒక సినిమా వర్క్ కంప్లీట్ అవ్వగానే మరో సినిమాకు షిఫ్ట్ అవుతూ తన షెడ్యూల్‌ ను పరుగులు పెట్టిస్తున్నారు. రీసెంట్ గా రణబాలి షూటింగ్ కంప్లీట్ అయింది. దానికి సంబంధించిన డబ్బింగ్ పనులు కూడా ముగించినట్లు సమాచారం. దీంతో ఏ మాత్రం గ్యాప్ లేకుండా రౌడీ జనార్దన మూవీపై ఫోకస్ పెట్టారు.

ఆ సినిమా కొత్త షెడ్యూల్ మంగళూరులో మొదలు కానుంది. ఆ షెడ్యూల్‌ లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను మేకర్స్ షూట్ చేయనున్నట్లు సమాచారం. సినిమాకు మెయిన్ సీన్స్ తోపాటు భారీ యాక్షన్ ఎపిసోడ్‌ ను తెరకెక్కించేందుకు మూవీ టీమ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో మంగళూరు షెడ్యూల్ సినిమాకు మెయిన్ గా మారింది. విజయ్ ఇలా వరుసగా రెండు భారీ సినిమాల పనులను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.

రణబాలి తర్వాత రౌడీ జనార్దన షూటింగ్‌ కు విజయ్ దేవరకొండ వెళ్లడంతో ఆయన ఫ్యాన్స్‌ లో కూడా ఇంట్రెస్ట్ పెరుగుతోంది. రెండు సినిమాలపై ఇప్పటికే ఆడియన్స్ లో అంచనాలు ఉండటంతో.. వరుసగా వచ్చే ఆ ప్రాజెక్టుల్లో విజయ్ ఎలాంటి పాత్రల్లో కనిపించబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రౌడీ జనార్దన మూవీ కోసం మంగళూరులో జరుగుతున్న యాక్షన్ సీక్వెన్స్‌ పై ఇప్పుడు ఫోకస్ ఉంది.

నార్మల్ సీన్స్ తో కాకుండా యాక్షన్‌ కు ఇంపార్టెన్స్ ఉన్న బిగ్ ఎపిసోడ్‌ ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమా షూటింగ్ మరింత ముందుకు వెళ్లనుంది. ఇక విజయ్ దేవరకొండ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా మరోవైపు బిజినెస్ లో కూడా అడుగులు వేస్తున్నారు. ఇటీవలే Unhype పేరుతో స్కిన్‌ కేర్ బ్రాండ్‌ ను స్టార్ట్ చేశారు. ఆ బ్రాండ్ డిజైనింగ్ లో కూడా విజయ్ పార్టనర్ గా ఉన్నట్లు సమాచారం.

లాంచ్ తర్వాత విజయ్ కొత్త బ్రాండ్ కు ఇండియా వైడ్ గా మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఒకవైపు కెమెరా ముందుకు వెళ్తూనే.. మరోవైపు తన సొంత బ్రాండ్ పనులు కూడా చూసుకుంటున్నారు. అలా రణబాలి పూర్తి చేసి మంగళూరులో రౌడీ జనార్దన కొత్త షెడ్యూల్ మొదలుపెట్టడంతో ప్రస్తుతం ఆయన స్పీడ్ మామూలుగా లేదనే చెప్పాలి. వరుస ప్రాజెక్టులతో రౌడీ హీరో ఇప్పుడు ఫుల్ స్వింగ్‌ లో ఉన్నారని చెప్పాలి. మరి ఫ్యూచర్ లో ఆయన ఎలాంటి హిట్స్ అందుకుంటారో అంతా వేచి చూడాలి.