Begin typing your search above and press return to search.

రౌడీ జనార్ధన్ కోసం స్టార్ ప్యాకింగ్..!

రౌడీ జనార్ధన్ అనే పర్ఫెక్ట్ టైటిల్ తో వస్తున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో కింగ్ డం తో సందడి చేశాడు.

By:  Ramesh Boddu   |   21 Sept 2025 12:16 PM IST
రౌడీ జనార్ధన్ కోసం స్టార్ ప్యాకింగ్..!
X

రౌడీ జనార్ధన్ అనే పర్ఫెక్ట్ టైటిల్ తో వస్తున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఈ హీరో కింగ్ డం తో సందడి చేశాడు. సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అన్నది పక్కన పెడితే విజయ్ ఫ్యాన్స్ కి ఐతే ఫీస్ట్ ఇచ్చింది. గౌతం తిన్ననూరి ఇంకాస్త గ్రిప్పింగ్ తో చేసుంటే అది కమర్షియల్ గా కూడా వర్క్ అవుట్ అయ్యేది. ఆ విషయం పక్కన పెడితే విజయ్ దేవరకొండ రవికిరణ్ కోలా డైరెక్షన్ లో రౌడీ జనార్ధన్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

విలన్ గా స్టార్ హీరో..

విజయ్ సినిమాలను బాగా ఇష్టపడి.. అతనికి అభిమానిగా మారిన రవికిరణ్ కోలా విజయ్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపించాలని చూస్తున్నాడు. రౌడీ జనార్ధన్ సినిమా కోసం మేకర్స్ చాలా పెద్ద ప్లానింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. సినిమాలో విలన్ గా స్టార్ హీరోని తీసుకుంటున్నారట. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ మూవీగా రౌడీ జనార్ధన్ వస్తుంది.

ఐతే ఈ సినిమాను విజయ్దశమికి ముహూర్తం పెడుతున్నారట. సినిమా ఇప్పటికే సెట్స్ మీద ఉందని అనుకున్న ఆడియన్స్ కి షాక్ ఇచ్చారు. అక్టోబర్ 2న సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఐతే ఈ సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ ని తీసుకున్నారని టాక్. హీరోగా ఆల్మోస్ట్ కెరీర్ క్లోజ్ అయిన రాజశేఖర్ డిఫరెంట్ రోల్స్ చేయాలని చూస్తున్నారు. అలానే ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ లో కనిపించాడు. కానీ అది కూడా వర్క్ అవుట్ కాలేదు.

రౌడీ జనార్ధన్ సమ్మర్ టార్గెట్ తో..

విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ లో రాజశేఖర్ విలనిజాన్ని పర్ఫెక్ట్ గా వాడుకుంటారని అంటున్నారు. సీరియస్ రోల్స్ లో రాజశేఖర్ అదరగొట్టేస్తారు. ఒకప్పుడు ఆయన సీరియస్ రోల్ లో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఐతే రౌడీ జనార్ధన్ కోసం రాజశేఖర్ మళ్లీ యాంగ్రీ మ్యాన్ గా మారుతున్నారు. మరి విజయ్ వర్సెస్ రాజశేఖర్ ఈ ఫైట్ దాదాపు కన్ ఫర్మ్ అంటున్నారు. సినిమాలో రాజశేఖర్ రోల్ ఎలా ఉంటుంది అన్నది త్వరలో తెలుస్తుంది.

విజయ్ రౌడీ జనార్ధన్ సినిమా 2026 సమ్మర్ టార్గెట్ తో వస్తుంది. ఈ సినిమా లవ్ స్టోరీనే కానీ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. విజయ్ కీర్తి సురేష్ ఇదివరకు మహానటిలో నటించారు. ఐతే అందులో విజయ్, కీర్తి సురేష్ కలిసి చేసిన సీన్స్ అయితే లేవు. ఈసారి విజయ్ కి జతగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ ఇద్దరి పెయిర్ కూడా సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటుందని చెప్పొచ్చు.