ఆ నటుడైనా విజయ్ ను సేవ్ చేస్తారా?
తొలిసారి కీర్తి సురేశ్ తో జతకట్టడం అందులో ఒక రీజనే. ఎందుకంటే స్క్రీన్ పై జోడీ కొత్త అనుభూతి ఇస్తుంది.
By: M Prashanth | 23 Sept 2025 2:00 AM ISTవిజయ్ దేవరకొండ కెరీర్ కు రౌడీ జనార్ధన్ సినిమా అత్యంత కీలకం కానుంది. వరుస ఫ్లాఫులతో సతమవుతున్న రౌడీ హీరోకు రీసెంట్ గా కింగ్డమ్ తో వచ్చినా.. అది అనుకున్న విజయం ఇవ్వలేదు. దీంతో పక్కాగా ప్లాన్ తో ఈసారి గట్టిగానే కొట్టాలని ఫిక్స్ అయ్యాడు విజయ్. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేయకూడదని ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.
తొలిసారి కీర్తి సురేశ్ తో జతకట్టడం అందులో ఒక రీజనే. ఎందుకంటే స్క్రీన్ పై జోడీ కొత్త అనుభూతి ఇస్తుంది. ఈ క్రమంలోనే సినిమాలో విలన్ పాత్ర కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతుంది. ఇందులో సీనియర్ నటుడు రాజశేఖర్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ ఇద్దరి మధ్య యాక్షన్ సీన్లు థియేటర్లలో ఈలలు పడేలా చేస్తాయని అంటున్నారు. అలాగే రాజశేఖర్ పాత్ర ఇందులో డిఫరెంట్ గా ఉండనుందని.. ఈ సినిమా పక్కా ఆయనకు కూడా పర్ఫెక్ట్ రీ ఎంట్రీ కానుందని టాక్ ఉంది.
సినిమా నేపథ్యం రాయలసీమ బ్యాక్ డ్రాప్, యాక్షన్, గ్రామీణ ఇంటెన్సిటీగా ఉంటుందని నిర్మాత దిల్ రాజు ఇదివరకే క్లూ ఇచ్చారు. లవ్ స్టోరీ ఆధారంగా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ టచ్ లో సినిమా ఉండనుంది. లవ్, యాక్షన్ డ్రామాతో యూత్.. ఎమోషన్స్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. రవికిరణ్ కోలా దర్శకత్వం వహించనున్నారు. భారీ స్థాయిలో, కచ్చితమైన ప్లానింగ్ తో ఈ సినిమాను తెరకెక్కించడానికి దర్శకుడు రవి సన్నాహాలు చేస్తున్నారు. 2026 సమ్మర్ రిలీజ్ టార్గెట్ గా పెట్టుకున్నారు. అప్పటి వరకు సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇకపోతే, విజయ్ - కీర్తి సురేష్ జంట కెమిస్ట్రీ చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండకు ఈ సినిమా భారీ హిట్ ఇస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవరాల్ గా రౌడీ జనార్ధన్ మాస్ ఎంటర్టైనర్ గా, బ్లాక్ బస్టర్ పొటెన్షియల్ తో వస్తోందని చెప్పవచ్చు. షూటింగ్ ప్రారంభం అయ్యాక మరిన్ని విషయాలు బయటకు వస్తాయి.
