తెలుగు ఆడియన్స్ అభిరుచి మారిపోయిందా? అలాంటి సినిమాలనే ఆదరిస్తున్నారా?
సినిమాలను చూసే ప్రేక్షకుల అభిరుచి ఎప్పుడు ఒకేలా ఉండదు. మారుతున్న కాలాన్ని బట్టి వాళ్ళు సినిమాలను చూసే విధానం కూడా మారిపోతుంది.
By: Gopi Velupala | 27 Sept 2026 2:00 PM ISTసినిమాలను చూసే ప్రేక్షకుల అభిరుచి ఎప్పుడు ఒకేలా ఉండదు. మారుతున్న కాలాన్ని బట్టి వాళ్ళు సినిమాలను చూసే విధానం కూడా మారిపోతుంది. అలాగే సినిమా కథలను కూడా వాళ్ళు కొత్తగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు మూస ధోరణిలో ఉండే రొటీన్ రొట్టా కథలను కాకుండా డిఫరెంట్ కథలను అటెంప్ట్ చేసినప్పుడు తప్పకుండా ప్రేక్షకులు ఆయా సినిమాలను ఆదరిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి ఒకప్పుడు ప్యాక్షన్ సినిమాలను ఆదరించిన తెలుగు ప్రేక్షకులు ఆ తర్వాత హీరోలు వారియర్ గా మారి పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన సినిమాలను కూడా ఆదరించారు. ఇక ఇప్పుడు పూర్తిగా వాళ్ల అభిరుచి మారిపోయింది. డిఫరెంట్ కథలతో వచ్చిన వారిని మాత్రమే వాళ్లు ఆదరిస్తున్నారు. దానికి తోడు సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ మీద కూడా జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత రెండు మూడు సంవత్సరాలుగా యాక్షన్ నేపధ్యంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ లను సాధించాయి. కాబట్టి యాక్షన్ ఎపిసోడ్స్ కి సైతం ప్రేక్షకులు విపరీతంగా కనెక్ట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రేమ కథ చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు.
ఈ మధ్యకాలంలో అయితే రా అండ్ రాస్టిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలను ఆడియన్స్ ఎక్కువ సంఖ్యలో ఆదరిస్తున్నారు. ఏది ఏమైనా కూడా కథ బాగుండి సినిమా చూసే ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉంటే అలాగే దర్శకుడు చేసిన టేకింగ్ చాలా ఫ్రెష్ గా ఉండి ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని ఇస్తే సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కథలో వైవిధ్యం లేకపోతే వాళ్లు అసలు పట్టించుకోవడం లేదు... రాబోయే రోజుల్లో మన దర్శకులు కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుంటుంది. లేకపోతే ప్రేక్షకులు ఆయా సినిమాలను రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి...
తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద కొంతవరకు హాలీవుడ్ సినిమాల ప్రభావం ఉన్నప్పటికి మన తెలుగు నేటివిటికి తగ్గట్టుగా కథలను డిఫరెంట్ గా డిజైన్ చేస్తూ ప్రేక్షకుడిని మెప్పిస్తే మాత్రం సినిమాలు సూపర్ సక్సెస్ అవుతాయి. లేకపోతే మాత్రం సినిమాలు డిజాస్టర్ బాట పడతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు... దానికి తోడుగా ప్రేక్షకులందరు హాలీవుడ్ రేంజ్ లో సినిమాలన్నింటిని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ అభిరుచి అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని రాబోయే సినిమాలను చాలా బాగా డిజైన్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది...
