కోర్ట్ హీరో హీరోయిన్ 'బ్యాండ్ మేళ్లం' కథ ఏంటీ...!
నాని సమర్పణలో రామ్ జగదీష్ దర్శకత్వంలో రూపొంది ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'కోర్ట్' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
By: Ramesh Palla | 4 Aug 2025 2:00 PM ISTనాని సమర్పణలో రామ్ జగదీష్ దర్శకత్వంలో రూపొంది ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'కోర్ట్' మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక సోషల్ మెసేజ్‌తో పాటు, యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సాగిన కోర్ట్ డ్రామా 'కోర్ట్' ఈ ఏడాది మేటి చిత్రాల్లో ఒకటిగా నిలిచిన విషయం తెల్సిందే. కోర్ట్ సినిమాలో ప్రధాన పాత్రలో ప్రియదర్శి నటించారు. ఇంకా సినిమాలో చందు పాత్రలో రోషన్, జాబిలి పాత్రలో శ్రీదేవి నటించిన విషయం తెల్సిందే. ప్రియదర్శికి నటుడిగా మంచి మార్కులు దక్కితే, రోషన్ ఇంకా శ్రీదేవికి స్టార్‌డం దక్కింది. ఇద్దరూ కోర్ట్ సినిమా తర్వాత చాలా బిజీ అయ్యారు. ఇప్పటికే శ్రీదేవి తమిళ్‌లో ఒక పెద్ద సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కింది. తెలుగు అమ్మాయి కావడంతో తెలుగులో స్టార్ హీరోల సినిమాలు రాకపోవచ్చు. కానీ మరో తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కింది.
రోషన్, శ్రీదేవిల కొత్త సినిమా
కోర్ట్ వంటి సూపర్ హిట్‌తో రోషన్, శ్రీదేవిల పెయిర్‌కి మంచి టాక్ దక్కింది. హిట్ పెయిర్‌గా వీరిని పిలుస్తున్నారు. ఈ సమయంలో వీరిద్దరి కాంబోలో మరో సినిమా వస్తే ఖచ్చితంగా విడుదలకు ముందే హిట్ టాక్ వస్తుంది. అందుకే వారి హిట్ పెయిర్‌ను సద్వినియోగం చేసుకోవడం కోసం కొత్త సినిమాను మొదలు పెట్టారు. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు 'బ్యాండ్ మేళ్లం' అనే టైటిల్‌ను అనుకుంటున్నారట. టైటిల్ కాస్త విభిన్నంగా ఉండటంతో ఖచ్చితంగా ఇది ఒక రొమాంటిక్ లవ్ డ్రామా అయ్యి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో శ్రీదేవికి పాపులారిటీ
శ్రీదేవి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ పాపులర్ అయింది. లక్కీగా కోర్ట్ సినిమా యూనిట్ సభ్యుల కంట పడటంతో శ్రీదేవి పంట పడింది. ఇన్‌స్టాలో కోర్ట్ సినిమా విడుదలకు ముందు ఉన్న ఫాలోవర్స్ సంఖ్యతో పోల్చితే ఇప్పుడు ఆమె ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగింది. శ్రీదేవి నటిగా ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని కోరుకుటుంది. హీరోయిన్‌గా ముందు ముందు పెద్ద హీరోలతో చేయాలని ఆశ పడుతుంది. అయితే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ప్రోత్సాహకం తక్కువగా ఉంటుంది. అందుకే ఈమె తెలివిగా తమిళ సినిమాలను సైతం సమాంతరంగా చేయాలని పెట్టుకుంది. అక్కడ హిట్స్ పడితే ఖచ్చితంగా టాలీవుడ్ నుంచి పెద్ద హీరోల సినిమాల్లో నటించేందుకు పిలుపు రావచ్చు.
సలార్ లో పవర్ ఫుల్ పాత్రలో రోషన్
ఇక రోషన్ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి సినిమాల్లో కనిపిస్తూనే ఉన్నాడు. గత పదేళ్లుగా ఇతడు బాల నటుడిగా కొనసాగుతున్నాడు. కోర్ట్ సినిమా ముందు కూడా సలార్ సినిమాలో రోషన్ కనిపించిన విషయం తెల్సిందే. చేసింది చిన్న పాత్ర అయిన మంచి గుర్తింపును సలార్ తెచ్చి పెట్టింది. ఆ సినిమా వల్లే కోర్ట్ సినిమా ఆఫర్ వచ్చింది అనేది సమాచారం. ఆ విషయం పక్కన పెడితే రోషన్ ముందు ముందు మరిన్ని సినిమాలు చేయాలని ఆశపడుతున్నారు. వయసుకు తగ్గట్లుగా టీనేజ్ లవ్ స్టోరీస్ సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఆ మధ్య ఈటీవీ విన్‌లో ఇతడు నటించిన ఏఐఆర్ వెబ్ సిరీస్ వచ్చింది. ఆ వెబ్ సిరీస్‌కి మంచి స్పందన దక్కింది. అందులోనూ అతడి నటనకు మంచి మార్కులు దక్కాయి.
కోర్ట్ వంటి సూపర్ హిట్ తర్వాత రోషన్, శ్రీదేవి కలిసి నటించబోతున్న నేపథ్యంలో తప్పకుండా అంచనాలు భారీగా ఉంటాయి. దానికి తోడు విభిన్నమైన బ్యాండ్ మేళ్లం అంటూ టైటిల్‌ను పెట్టడం ద్వారా మరింతగా సినిమాకు పాపులారిటీ దక్కే అవకాశాలు ఉన్నాయి. ముందు ముందు వీరి కాంబోలో మరిన్ని సినిమాలు వస్తాయేమో చూడాలి. బ్యాండ్ మేళ్లం సినిమా హిట్ అయితే తప్పకుండా మరిన్ని సినిమాలు వీరి కాంబోలో వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. త్వరలో బ్యాండ్ మేళ్లంకు సంబంధించిన మరిన్ని విషయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
