రోషన్ కు జోడీగా కన్నప్ప భామ
నిర్మలా కాన్వెంట్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమ్యాడు శ్రీకాంత్ కొడుకు రోషన్. ఆ తర్వాత రాఘవేంద్ర రావు దర్శకత్వంలో పెళ్లి సందD మూవీ చేసి అందరినీ ఇంప్రెస్ చేశాడు
By: Sravani Lakshmi Srungarapu | 20 Jan 2026 11:00 PM ISTనిర్మలా కాన్వెంట్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమ్యాడు శ్రీకాంత్ కొడుకు రోషన్. ఆ తర్వాత రాఘవేంద్ర రావు దర్శకత్వంలో పెళ్లి సందD మూవీ చేసి అందరినీ ఇంప్రెస్ చేశాడు. శ్రీకాంత్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రోషన్ రీసెంట్ గా ఛాంపియన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్ ను అందుకున్నాడు.
సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తలు
హిట్ వచ్చింది కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేయాలని తొందరపడకుండా రోషన్ సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. నటుడిగా తనకు మంచి పేరు తీసుకురావడంతో పాటూ ఆడియన్స్ కు నచ్చే కథలు చేయాలని ఆచితూచి అడుగులేస్తున్నాడు. అందులో భాగంగానే రోషన్ ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
హిట్ ఫ్రాంచైజ్ డైరెక్టర్ తో సినిమా
టాలీవుడ్ లో హిట్ ఫ్రాంచైజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శైలేష్ కొలను, ఇప్పటివరకు ఆ ఫ్రాంచైజ్ లో మూడు సినిమాలు చేసి హిట్లు అందుకున్నారు. మధ్యలో వెంకటేష్ హీరోగా సైంధవ్ చేసినా అది ఫ్లాపుగా నిలిచింది. ఆఖరిగా హిట్3తో రక్తాన్ని ఏరుల్లా పారించిన శైలేష్ ఇప్పుడు రోషన్ తో ఓ సినిమా చేస్తున్నారు. అది కూడా ప్రేమ కథ అని తెలుస్తోంది.
రూట్ మార్చిన శైలేష్
ఇప్పటివరకు యాక్షన్ థ్రిల్లర్లు తీసిన శైలేష్ మొదటిసారి రూట్ మార్చి రోషన్ తో లవ్ స్టోరీ చేయబోతున్నారు. ఇప్పటికే స్టోరీ లాక్ అయిపోగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడో అప్డేట్ తెలుస్తోంది. ఈ సినిమాలో రోషన్ సరసన కన్నప్ప సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రీతి ముకుందన్ ఫైనల్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రీతికి ఇది తెలుగులో మూడో సినిమా. మొదటిగా శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ఓం భీమ్ బుష్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకుల పరిచయమైన ప్రీతి ముకుందన్, తర్వాత మంచు విష్ణు సరసన కన్నప్పలో జోడీ కట్టింది. ఇప్పుడు రోషన్ సరసన నటించడానికి ప్రీతి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రీతి ఈ సినిమాలో నటించనుందని తెలిసినప్పటి నుంచి రోషన్ కు జోడీగా ప్రీతి బాగా సెట్ అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
