Begin typing your search above and press return to search.

శ్రీకాంత్ కొడుకు 'ఛాంపియన్' టీజర్.. ఎలా ఉందంటే..

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ మేకా.. పెళ్లి సందD మూవీతో ఇప్పటికే హీరోగా మారిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   1 Nov 2025 1:17 PM IST
శ్రీకాంత్ కొడుకు ఛాంపియన్ టీజర్.. ఎలా ఉందంటే..
X

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ మేకా.. పెళ్లి సందD మూవీతో ఇప్పటికే హీరోగా మారిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో తన యాక్టింగ్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ఛాంపియన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొన్నేళ్ల క్రితం ఆ సినిమా అనౌన్స్ చేయగా.. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది.




పీరియాడిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఛాంపియన్ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి తీసుకురానున్నాయి.

మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ ను కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేయగా.. ఆడియన్స్ ను మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా టీజర్ ను విడుదల చేశారు. అది కూడా అందరినీ మెప్పిస్తూ.. సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. విడుదల అయిన కాసేపటికే వైరల్ గా మారింది.

పవర్ ఫుల్ మ్యూజిక్ తో టీజర్ స్టార్ట్ అయింది. గుర్రాలపై అనేక మంది యుద్ధం చేస్తున్నట్లు కనిపించింది. అప్పుడే రోషన్ ఎంట్రీ ఇచ్చారు. ఒక్కడినే సెంటర్ కు బాల్ తీసుకొని వెళ్తా.. గోల్ కొడతా అంటూ పవర్ ఫుల్ డైలాగ్ చెబుతారు. ఆ తర్వాత రోషన్ నా పేరు మైఖేల్ అంటూ పరిచయం చేసుకుంటూ ఫుట్ బాల్ ఆడుతూ కనిపిస్తారు.

ఆ తర్వాత మొత్తం యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. చివర్లో రోషన్ పెద్ద గన్ ఎక్కు పెడుతున్నట్లు చూపించిన సీన్ అదిరిపోయింది. ఓవరాల్ గా టీజర్.. ఇప్పుడు అందరినీ మెప్పిస్తోంది. ప్రతి సీన్ కూడా గూస్ బంప్సేనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. టీజర్ ను చాలా బాగా కట్ చేశారని, సూపర్ అంటూ మేకర్స్ ను కొనియాడుతున్నారు.

అయితే రోషన్ లుక్ చాలా ఫ్రెష్ గా ఉందని చెప్పాలి. గేమింగ్ నైపుణ్యాన్ని సాధించడానికి కష్టపడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. స్టోరీ విభిన్నంగా ఉన్నట్లు అర్థమవుతోంది. దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఐడియా బాగున్నట్లు కనిపిస్తోంది. హీరోయిన్ గా అనశ్వర రాజన్ పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే ఓ రేంజ్ లో ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో అంతా వేచి చూడాలి.