‘ఛాంపియన్’ హీరోకి బంపర్ ఆఫర్
ఇటీవలే 'ఛాంపియన్' సినిమాను చూసిన అల్లు అరవింద్, అందులో రోషన్ పర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యారట. ఆ వయసుకి మించిన పరిణితితో రోషన్ నటించిన తీరు, స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనకు ఎంతగానో నచ్చాయి.
By: M Prashanth | 27 Dec 2025 6:30 PM ISTటాలీవుడ్ లో కొత్త టాలెంట్ ను గుర్తించడంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్టైలే వేరు. ఎంతోమంది యువ హీరోలను ఎంకరేజ్ చేసి, వారిలో స్పార్క్ కనిపిస్తే వెంటనే తన బ్యానర్ లో అవకాశాలు ఇస్తుంటారు. ఇప్పుడు ఆ లక్కీ ఛాన్స్ యంగ్ హీరో రోషన్ మేకాను వరించింది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రోషన్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఛాంపియన్' ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాతో రోషన్.. అల్లు అరవింద్ దృష్టిలో పడ్డాడు.
ఇటీవలే 'ఛాంపియన్' సినిమాను చూసిన అల్లు అరవింద్, అందులో రోషన్ పర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యారట. ఆ వయసుకి మించిన పరిణితితో రోషన్ నటించిన తీరు, స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనకు ఎంతగానో నచ్చాయి. దీంతో వెంటనే ఆ కుర్రాడిని అభినందించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు హైదరాబాద్ లో అల్లు అరవింద్, రోషన్ మేకాను ప్రత్యేకంగా తన ఆఫీస్ కు ఆహ్వానించి కలిశారు.
కేవలం మాటలతో మెచ్చుకుని వదిలేయకుండా, రోషన్ కు ఒక అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు అల్లు అరవింద్. తన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలో రోషన్ హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రోషన్ లుక్స్, డ్యాన్స్ లో ఈజ్, సినిమా కోసం అతను చూపించిన డెడికేషన్ చూసి.. వెంటనే మరో ఆలోచన లేకుండా సినిమాను లాక్ చేసుకున్నారు. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి ఆఫర్ రావడం రోషన్ కు పెద్ద జాక్ పాట్ అనే చెప్పాలి.
లెజెండరీ ప్రొడ్యూసర్ నుంచి ఇలాంటి పిలుపు రావడంతో రోషన్ ఆనందానికి అవధులు లేవు. తనలోని టాలెంట్ ను గుర్తించి, ఇంత పెద్ద ప్లాట్ ఫామ్ ఇచ్చినందుకు అల్లు అరవింద్ కు రోషన్ కృతజ్ఞతలు తెలిపాడు. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో సినిమా అంటే ఆ హీరో కెరీర్ గ్రాఫ్ మారినట్లే. మొత్తానికి 'ఛాంపియన్' ఫలితంతో సంబంధం లేకుండా రోషన్ కు జరగాల్సిన మేలు అయితే జరిగిపోయింది.
ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన 'ఛాంపియన్' చిత్రంలో అనశ్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. స్వప్న సినిమా నిర్మాణ విలువలు, రోషన్ నటనకు ప్రస్తుతం ఆడియెన్స్ నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఓవైపు సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్, మరోవైపు మెగా ప్రొడ్యూసర్ ఇచ్చిన ఆఫర్ తో 'ఛాంపియన్' టీమ్ మొత్తం ఫుల్ ఖుషీగా ఉంది.
