వయొలెంట్ డైరెక్టర్ తో రోషన్ లవ్ స్టోరీ
శ్రీకాంత్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రోషన్, ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల సెలక్షన్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న రోషన్ తర్వాతి సినిమా ఖరారైనట్టు తెలుస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 5 Oct 2025 5:00 PM ISTటాలీవుడ్ లోని యంగ్ హీరోల్లో కెరీర్ మొదటి నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్ లను ఎంపిక చేసుకుంటూ తనదైన యాక్టింగ్ తో ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేశాడు రోషన్. శ్రీకాంత్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రోషన్, ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల సెలక్షన్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్న రోషన్ తర్వాతి సినిమా ఖరారైనట్టు తెలుస్తోంది.
వయొలెంట్ డైరెక్టర్ తో..
ప్రస్తుతం రోషన్ రెండు సినిమాలతో బిజీగా ఉండగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హిట్, హిట్2, హిట్3, సైంధవ్ లాంటి వయొలెంట్ మరియు యాక్షన్ థ్రిల్లర్లకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శైలేష్ కొలనుతో రోషన్ సినిమా చేయనున్నాడు. రోషన్ తో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు వయొలెంట్ డైరెక్టర్ శైలేష్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
రోషన్ తో లవ్ స్టోరీ..
హిట్ ఫ్రాంచైజ్ తో డైరెక్టర్ గా శైలేష్ మంచి పాపులారిటీని అందుకున్నారు. హిట్ ఫస్ట్ కేస్ నుంచి రీసెంట్ గా నాని హీరోగా వచ్చిన హిట్3 వరకు ఆడియన్స్ ను మెప్పించి సక్సెస్ అందుకున్న శైలేష్ మధ్యలో విక్టరీ వెంకటేష్ తో కలిసి సైంధవ్ అనే యాక్షన్ థ్రిల్లర్ చేశారు. కానీ సైంధవ్ అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పటివరకు యాక్షన్ థ్రిల్లర్, వయొలెన్స్ సినిమాలే తీసిన శైలేష్ ఇప్పుడు కొత్తగా లవ్ స్టోరీని తీయనుండటం ఆసక్తికరంగా మారింది.
రెండు సినిమాలతో బిజీబిజీగా..
ఈ సినిమాను టాలీవుడ్ పాపులర్ నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఇక రోషన్ విషయానికొస్తే ప్రస్తుతం ఈ యంగ్ హీరో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో వస్తోన్న వృషభలో మోహన్ లాల్ కు కొడుకుగా నటిస్తున్నాడు. దాంతో పాటూ ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఛాంపియన్ అనే సినిమాను కూడా చేస్తున్నాడు రోషన్. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక శైలేష్ తో సినిమాను స్టార్ట్ చేయనున్నాడు రోషన్.
