మోగ్లీ గ్లింప్స్ రిలీజ్.. సుమా కొడుకు ఆకట్టుకున్నాడా?
ప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల, ప్రముఖ యాంకర్ సుమ కనకాల దంపతుల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న రెండవ చిత్రం మోగ్లీ.
By: Madhu Reddy | 29 Aug 2025 5:49 PM ISTప్రముఖ సినీ నటుడు రాజీవ్ కనకాల, ప్రముఖ యాంకర్ సుమ కనకాల దంపతుల తనయుడు రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న రెండవ చిత్రం మోగ్లీ. ఇదివరకే బబుల్ గమ్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన రోషన్ .. ఇప్పుడు మోగ్లీ అంటూ మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. 'కలర్ ఫోటో' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రాజ్. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్ గా నటిస్తోంది. నాచురల్ స్టార్ నాని వాయిస్ ఓవర్ తో కూడిన ఈ గ్లింప్స్ ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నాని వాయిస్ ఓవర్ తో మోగ్లీ గ్లింప్స్ రిలీజ్..
గ్లింప్స్ విషయానికి వస్తే.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుండీ రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ మొదలవగానే.. ఒక చెట్టుపై తేలు పాకుతున్నట్టు విజువల్ చూపించారు. నాని వాయిస్ ఓవర్ తో.. "ఒక చిన్న ప్రేమ కథ చెప్తా.. 2025.. టెక్నాలజీకి ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వని రోజులు. అడవిలోకి వెళ్తే కనీసం ఫోన్ సిగ్నల్స్ కూడా వచ్చేవి కావు.. అలాంటి టైంలో ఒకడు 30 మందిని తిండి, నిద్ర లేకుండా పరిగెత్తించాడు. గ్యాంగ్స్టర్, స్మగ్లర్ కాదు పాతికేళ్లు కూడా నిండని ఒక ప్రేమికుడు. మన సిటీలో ఎలా బ్రతకాలో మనకు తెలిసిన దాంట్లో 50% కూడా వాడికి తెలియదు. కానీ అడవిలో ఎలా బ్రతకాలో మనకంటే 50 రెట్లు ఎక్కువ తెలుసు. ఎందుకు పరిగెత్తించాడనే కదా మీ అనుమానం..? " మరి తన బంగారు ప్రేమకథలో వేలు పెడితే కుట్టడా.. కొట్టడా" అంటూ నాని వాయిస్ ఓవర్ తో ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా ఈ గ్లింప్స్ కి నాని వాయిస్ హైలెట్గా నిలిచింది. పచ్చని చెట్ల మధ్య స్వచ్ఛమైన ప్రేమ కథను ఈ మోగ్లీ సినిమా ద్వారా దర్శకుడు సందీప్ రాజ్ మనకు చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ గ్లింప్స్ చూస్తుంటే రోషన్ కనకాల ఈసారి తన నటనతో ఆకట్టుకోబోతున్నాడని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనే విషయం తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేవరకు ఆగాల్సిందే.
హీరోయిన్ క్యారెక్టర్ అదేనా?
మోగ్లీ సినిమా విషయానికి వస్తే.. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు అసలు మాటలు రావని సమాచారం. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి నిర్వహించిన ఈవెంట్ లో కూడా ఆమె ఏం మాట్లాడలేదు. రోషన్ దీని గురించి ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం ఆమె ఏమీ మాట్లాడలేదు.. దానికి కారణం తర్వాత చెప్తాము అంటూ కూడా తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమాలో ఆమె మాటలు రాని అమ్మాయి పాత్రలో నటిస్తోంది కాబోలు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అయితే ఇన్ డైరెక్ట్ గా హీరోయిన్ పాత్ర రివీల్ చేశారు రోషన్ కనకాల.
