Begin typing your search above and press return to search.

ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది..

ఈ నేపథ్యంలోనే తాజాగా థాంక్యూ మీట్ నిర్వహించిన చిత్ర బృందం.. అందులో రోషన్ కనకాల మాట్లాడుతూ ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది అని తెలిపారు.

By:  Madhu Reddy   |   20 Dec 2025 12:14 PM IST
ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది..
X

సినీ ఇండస్ట్రీలోకి ఈమధ్యకాలంలో సినీ వారసుల ఎంట్రీ ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సత్తా చాటుతున్నారు. అలా వచ్చిన వారిలో ప్రముఖ యాంకర్ , సినీ నటి సుమా కనకాల వారసుడు కూడా ఒకరు. ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల , సుమా కనకాల దంపతుల కొడుకే రోషన్ కనకాల. తాజాగా ఈయన నటించిన చిత్రం మోగ్లీ 2025. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా థియేటర్లలో రన్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా థాంక్యూ మీట్ నిర్వహించిన చిత్ర బృందం.. అందులో రోషన్ కనకాల మాట్లాడుతూ ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది అని తెలిపారు.

విషయంలోకి వెళ్తే..సందీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా.. ఇటీవల విడుదలై శుక్రవారం హైదరాబాదులో థాంక్యూ మీట్ ఏర్పాటు చేయగా .. అందులో రోషన్ మాట్లాడుతూ " సినిమాను ఆదరించిన ప్రేక్షకులందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మా అమ్మని పిలిచాను. కానీ అమ్మ నీ హార్డు వర్క్ ను నమ్మి నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పింది. ఆమె వస్తే ఓవర్ ప్రమోషన్ అవుతుంది అనే ఆలోచనతోనే ఆమె రాలేదనుకుంటున్నాను. ఇక మా అమ్మ నాన్నలు ఇద్దరు ఈవెంట్స్ కి వస్తారని ఎంతో ఆశగా ఉన్నాను. కానీ వారు రాలేదు. అది నా దురదృష్టం. ఒకవేళ వాళ్ళు వచ్చి ఉంటే వేదిక పైన వాళ్లకు పాదాభివందనం చేసేవాడిని. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను లేను. వాళ్ళ వల్లే నేను ఈ స్టేజ్ లో ఉన్నాను. ఇంత మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఈవెంట్ కి వాళ్ళు రాకపోవడం నిజంగా దురదృష్టకరం

ఈ బాధ ఎప్పటికీ ఉంటుంది" అంటూ తన బాధను వ్యక్తపరిచారు రోషన్ కనకాల. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మోగ్లీ 2025 సినిమా విషయానికొస్తే.. పార్వతీపురం ఏజెన్సీ ఏరియాలో మోగ్లీ అలియాస్ మురళీకృష్ణ (రోషన్ కనకాల) లోకల్ గా జరిగే సినిమా షూటింగ్లకు జూనియర్ ఆర్టిస్టు సప్లయర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఎస్ఐ అవ్వాలనే అతని ప్రయత్నాలు ఒకవైపు చేస్తూనే.. మరొకవైపు ఈ పనులు తన స్నేహితుడు ప్రభాస్ బంటి (వైవా హర్ష) తో కలిసి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ సినిమాలో సైడ్ డాన్సర్ గా చేయడానికి వచ్చిన జాస్మిన్ (సాక్షి)తో మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు.

ఆమె మీద కన్నేసిన ఆ సినిమా నిర్మాత ఎలా అయినా ఆమెను అనుభవించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆమెను ట్రాప్ చేసిన క్రమంలో మోగ్లీ కి కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. మరి ఆ షాకింగ్ విషయాలు ఏమిటి? అసలు ఈ కథలో క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) పాత్ర ఏమిటి? హీరో హీరోయిన్లు కలిసారా? చివరికి వారి ప్రేమ గెలిచిందా? రోషన్ ఎస్సై అయ్యాడా? లాంటి విషయాలు తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.