Begin typing your search above and press return to search.

బాక్సాఫీస్ 'ఛాంపియన్'.. 4 రోజుల లెక్క ఎంతంటే?

స్వప్న సినిమా బ్యానర్ నుంచి వచ్చిన 'ఛాంపియన్' బాక్సాఫీస్ దగ్గర తన హవా కొనసాగిస్తోంది.

By:  M Prashanth   |   29 Dec 2025 12:13 PM IST
బాక్సాఫీస్ ఛాంపియన్.. 4 రోజుల లెక్క ఎంతంటే?
X

స్వప్న సినిమా బ్యానర్ నుంచి వచ్చిన 'ఛాంపియన్' బాక్సాఫీస్ దగ్గర తన హవా కొనసాగిస్తోంది. రోషన్ మేక, అనశ్వర రాజన్ జంటగా నటించిన ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా, నిర్మాతల నమ్మకాన్ని నిలబెడుతూ లాభాల బాట పట్టింది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ చిత్రం, క్రిస్మస్ కానుకగా విడుదలైన మిగతా సినిమాల కంటే బెస్ట్ కలెక్షన్స్ ని అందుకుంటూ రేసులో ముందుంది.





సినిమా విడుదలై నాలుగు రోజులు గడిచినా కలెక్షన్స్ లో జోరు తగ్గలేదు. ముఖ్యంగా వీకెండ్ లో సినిమా గ్రాఫ్ పైకి వెళ్లడం విశేషం. కొంత టాక్ అటు ఇటుగా మొదలైనప్పటికీ, ఇప్పుడు బుక్ మై షోలో ట్రెండింగ్ లో నిలవడమే కాకుండా, ఎ సెంటర్లలో (అర్బన్ ఏరియాల్లో) మంచి ఆక్యుపెన్సీ సాధిస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ సపోర్ట్ సినిమాకు బాగా దొరుకుతోంది.

ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ వెనుక నిర్మాతల ప్లానింగ్ కీలక పాత్ర పోషించింది. థియేటర్ రిలీజ్ కి ముందే నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా పెట్టుబడి వెనక్కి వచ్చేసిందట. దీంతో బాక్సాఫీస్ దగ్గర వచ్చే ప్రతి రూపాయి ఇప్పుడు నిర్మాతలకు లాభమే. ఎలాంటి రిస్క్ లేకుండా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రాఫిటబుల్ వెంచర్ గా మారింది.

బాక్సాఫీస్ లెక్కల విషయానికి వస్తే.. ఆదివారం రోజున ఆడియెన్స్ థియేటర్లకు పోటెత్తారు. దీంతో ఒక్క ఆదివారమే దాదాపు 2.6 కోట్ల వసూళ్లు వచ్చాయి. మొత్తంగా నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 'ఛాంపియన్' 11.5 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మేకర్స్ పోస్టర్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. రోషన్ కెరీర్ లో ఇంత తక్కువ టైంలో ఈ మార్క్ ని అందుకోవడం ఇదే మొదటిసారి.

రోషన్ నటన ఈ సినిమాకు ప్రధాన బలమని అంటున్నారు. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో చాలా పరిణితి కనబరిచాడని, కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని విమర్శకులు అంటున్నారు. కమర్షియల్ గా కూడా రోషన్ కి ఇది హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అతని కెరీర్ టర్న్ అవ్వడానికి ఈ సినిమా ఎంతగానో ఉపయోగపడింది. ముందు న్యూ ఇయర్ సెలవులు ఉండటం, బాక్సాఫీస్ దగ్గర ఇప్పట్లో పెద్ద సినిమాల పోటీ లేకపోవడం 'ఛాంపియన్' కు పెద్ద అడ్వాంటేజ్. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, ఈ సినిమా లాంగ్ రన్ లో మరిన్ని మంచి నంబర్స్ నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది.