ఛాంపియన్గా రాబోతున్న రోషన్ మేక.. రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ హీరోగా.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విభిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఒకప్పుడు కుటుంబ కథా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.
By: Madhu Reddy | 6 Oct 2025 5:28 PM ISTటాలీవుడ్ నటుడు శ్రీకాంత్ హీరోగా.. విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. విభిన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఒకప్పుడు కుటుంబ కథా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. అయితే అలాంటి శ్రీకాంత్ కొడుకు రోషన్ కూడా తండ్రి బాటలోనే హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈయన మొదట 'నిర్మలా కాన్వెంట్' అనే మూవీతో సినిమాల్లోకి వచ్చి.. 'పెళ్లి సందD' మూవీతో హీరోగా గుర్తింపు సంపాదించారు. ఈ సినిమాలో శ్రీలీల అందం,రోషన్ యాక్టింగ్ కి మంచి మార్కులు పడ్డాయి. అయితే పెళ్లి సందD సినిమా విడుదలయ్యాక దాదాపు నాలుగు సంవత్సరాలకి తన కొత్త సినిమా ఛాంపియన్ విడుదల డేట్ ని అనౌన్స్ చేశారు.
మరి రోషన్ నటిస్తున్న ఛాంపియన్ మూవీ ఎప్పుడు విడుదల కాబోతోంది అనేది చూస్తే.. ఈ ఏడాది చివర్లో క్రిస్మస్ పండగ సందర్భంగా తన కొత్త సినిమా ఛాంపియన్ మూవీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.. తాజాగా రోషన్ ఫ్లైట్ నుండి దిగుతున్న ఫోటోతో పోస్టర్ రిలీజ్ చేసి.. 2025 డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా ఛాంపియన్ మూవీ విడుదల చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దీంతో నాలుగు సంవత్సరాల తర్వాత రోషన్ కొత్త సినిమాతో రాబోతున్నారని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
ఛాంపియన్ మూవీ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఇప్పటివరకు మనం చూడని అతిపెద్ద స్పోర్ట్స్ సంబంధిత డ్రామాగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఛాంపియన్ మూవీ నుండి వచ్చిన గ్లింప్స్ అద్భుతంగా ఉండడంతో పాటు ఈ గ్లింప్స్ లో హైటెక్నికల్ బ్రిలియంట్ రోషన్ అథ్లెటిక్ ట్రాన్స్ఫర్మేషన్ లుక్ ఎంతోమందిని మంత్ర ముగ్ధుల్ని చేసింది. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో రోషన్ స్టైలిష్ సూట్ లో ఎంతో స్టైలిష్ గా చూపించారు.
ప్రస్తుతం పోస్టర్ తోనే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఛాంపియన్ మూవీ విషయానికి వస్తే.. నేషనల్ అవార్డు విన్నర్ అయినటువంటి ప్రదీప్ అద్వైతం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.అలాగే ఈ సినిమాని స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా అనస్వర రాజన్ నటిస్తోంది.. మిక్కీ.జే.మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
అయితే ఈ సినిమా సెలక్షన్ విషయంలో ఓ స్పెషల్ ఉంది. అదేంటంటే.. రోషన్ పెళ్లి సందD సినిమా చేశాక దాదాపు 50 కథలను రిజెక్ట్ చేసి ఫైనల్ గా ఈ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉన్న ఛాంపియన్ మూవీకి ఓకే చెప్పారట. అలా 50 సినిమాలు రిజెక్ట్ చేసి ఈ సినిమాని ఓకే చేశారంటే ఇందులో కథ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది.. అలాగే సినిమా నిర్మాతలు ఇది ఒక ప్రభావవంతమైన స్పోర్ట్స్ సినిమా అని.. థియేటర్లో సినిమా చూస్తే గొప్ప అనుభూతి కలుగుతుంది అని హామీ ఇస్తున్నారు. మరి చూడాలి ఛాంపియన్ సినిమా రోషన్ కి ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో.
