మాజీ ప్రియుడితో ట్రిప్తి ఇక్కట్లు
అయితే అతడి పాత్ర గురించి ఇప్పటివరకూ ఎలాంటి లీకులు అందలేదు. అవినాష్ ట్రిప్తికి మాజీ ప్రియుడు.
By: Sivaji Kontham | 14 Aug 2025 10:00 PM ISTముక్కోణ ప్రేమకథలో ఘర్షణ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాలా? అలాంటి ఘర్షణను ట్రిప్తి దిమ్రీ ఎదుర్కోబోతోందా? విశాల్ భరద్వాజ్ 'రోమియో' అలాంటి కథతో రూపొందుతోందా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి. షాహిద్ కపూర్- ట్రిప్తి దిమ్రీ మధ్య డీప్ లవ్ స్టోరి రన్ అవుతున్న సమయంలో అవినాష్ తివారీ ఎంట్రీ ఇస్తాడట.
అయితే అతడి పాత్ర గురించి ఇప్పటివరకూ ఎలాంటి లీకులు అందలేదు. అవినాష్ ట్రిప్తికి మాజీ ప్రియుడు. ఆ ఇద్దరి మధ్యా స్నేహం గురించి బాలీవుడ్ మీడియా చిలువలు పలువలుగా కథలు అల్లింది. 2018లో లైలా మజ్నులో నటించిన సమయంలో ఆ ఇద్దరూ ఒకరికొకరు సన్నిహితంగా మారారని కథనాలొచ్చాయి.
ప్రస్తుతం షాహిద్ కపూర్ సినిమాలో అవినాష్ పాత్ర ఎలా ఉంటుంది? అంటే నెగెటివ్ షేడ్ కి ఆస్కారం ఉందని గుసగుస వినిపిస్తోంది. అయితే అతడి పాత్ర పరిధి ఎలా ఉండబోతోంది? పరిమిత సమయమేనా? పూర్తి నిడివితో ఆకర్షిస్తుందా? అన్నదానికి క్లారిటీ లేదు. రోమియో ఇప్పటికే చిత్రీకరణ జరుగుతోంది. స్పెయిన్ షెడ్యూల్ తర్వాత ఎగ్జోటిక్ లొకేషన్లకు వెళ్లేందుకు విశాల్ భరద్వాజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అవినాష్ కొత్త లుక్‌తో శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారని తెలిసింది. షాహిద్ ప్రేమకథా చిత్రాల్లో నిరూపించిన నటుడు. కబీర్ సింగ్ లో అతడి అగ్రెస్సివ్ పెర్ఫామెన్స్ కి మంచి పేరొచ్చింది. ఇప్పుడు రోమియో అనే టైటిల్ కి తగ్గట్టే అతడి పాత్రలో ఎలాంటి ట్విస్టుల్ని చూపిస్తారో వేచి చూడాలి. అవినాష్ లాంటి ప్రతిభావంతుడిని దర్శకుడు సవ్యంగా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంది. సాజిద్ నడియాద్ వాలా ఈ చిత్రానికి నిర్మాత. టీజర్, ట్రైలర్ రాకతో రోమియో కథేమిటో అవగతమవుతుంది. కానీ దానికి ఇంకా సమయం ఉంది.
