మాస్ స్టెప్పులతో దుమ్ముదులిపేసిన రోజా!
12 ఏళ్ల విరామం తరువాత తమిళ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్న రోజా అక్కడ వరుస ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు.
By: Ravindar Gorantla | 23 March 2026 11:21 AM ISTసీనియర్ కథానాయికలు మళ్లీ రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా తమిళ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న సీనియర్ నటి శోభన ఈ ఏడాదే తమిళ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో మరో ఫైర్ బ్రాండ్ రోజా కూడా తమిళ సినిమాల్లోకి పునః ప్రవేశం చేస్తోంది. ఏపీ రాజకీయాల్లో గత కొంత కాలంగా బిజీగా ఉంటూ హాట్ టాపిక్‌గా మారిన నటి, పొలిటికల్ లీడర్ రోజా మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో పాలిటిక్స్ నుంచి బ్రేక్ తీసుకున్న రోజా వరుస చిత్రాలని అంగీకరిస్తూ నటిగా బిజీ అవుతున్నారు.
12 ఏళ్ల విరామం తరువాత తమిళ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తున్న రోజా అక్కడ వరుస ప్రాజెక్ట్‌లలో నటిస్తున్నారు. సంతానం హీరోగా నటిస్తున్న `లెనిన్ పాండ్యన్`తో రోజా తమిళ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ కావడంతో మరిన్ని ప్రాజెక్ట్‌లని లైన్‌లో పెట్టారు. ఇందులో భాగంగా రోజా నటించిన లేటెస్ట్ మూవీ `అన్బే డయానా`. పారి ఎలవళగన్ కథనాయకుడిగా నటించి తెరకెక్కిస్తున్నాడు. `జాబిలమ్మ నీకు అంత కోపమా` ఫేమ్ రమ్య రంగనాథన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగబ్బాయి, అంగ్లో ఇండియన్ అమ్మాయి నేపథ్యంలో సాగే ఓ రొమాంటిక్ లవ్ స్టోరీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ మూవీలో రోజా హీరో మథర్‌గా కీలక పాత్రలో నటిస్తోంది. చెన్నైలోని పెరంబూర్ నేపథ్యంలో సాగుతుంది. మిలియన్ డాలర్ స్టూడియోస్ నిర్మించిన ఈ మూవీ షూటింగ్ పూర్తియింది. రీసెంట్‌గా ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌గా `పెరంబూర్ గాన` పేరుతో విడుదల చేశారు. ఈ పాటలో రోజా మాస్ స్టెప్పులతో అలరించడం అందరిని ఆకట్టుకుంటోంది. హీరోయిన్ రమ్య రంగనాథన్, హీరో పారి ఎలవళగన్..కీలక నటీనటులతో రోజా కలిసి స్టెప్పులేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
పన్నెండేళ్ల సుధీర్ఘ విరామం తరువాత తమిళ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న రోజా ఈ సినిమాతో అక్కడ హంగామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. తాజాగా విడుదల చేసిన పాటలోని రోజు మాస్ స్టెప్పులు చూసిన వారంతా రోజా స్ట్రైక్స్ అగైన్ అంటూ కామెంట్‌లు పెడుతున్నారు. ఈ మూవీలో రోజా క్యారెక్టర్ పవర్‌ఫుల్ గా సాగుతుందని తెలుస్తోంది. రోజా నటించిన `లెనిన్ పాండ్యన్` షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీనితో పాటు ఆమె నటించిన `అన్బే డయానా` కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇటీవలే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టిన టీమ్ ప్రమోషన్స్‌ని కూడా స్టార్ట్ చేసి లిరికల్ వీడియోలని రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. రోజా ఈ మూవీకి యాడ్ కావడంతో ఈ సినిమాకు మంచి మైలేజ్ లభించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. రీసెంట్‌గా రాధిక నటించిన `తాయి కిళవి` బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మరో సీనియర్ నటి రోజా నటిస్తున్న `అన్బే డయానా` కూడా ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్‌గా మారింది.
