12 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. ఫైర్ బ్రాండ్ రోజా కొత్త లుక్ వైరల్
ఒకప్పుడు వెండితెరను ఏలిన స్టార్స్, చాలా గ్యాప్ తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపిస్తారంటే ఆడియన్స్‌లో ఒకరకమైన క్యూరియాసిటీ ఉంటుంది.
By: M Prashanth | 5 Nov 2025 6:27 PM ISTసినిమా ఇండస్ట్రీలో కమ్‌బ్యాక్‌లు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ఒకప్పుడు వెండితెరను ఏలిన స్టార్స్, చాలా గ్యాప్ తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపిస్తారంటే ఆడియన్స్‌లో ఒకరకమైన క్యూరియాసిటీ ఉంటుంది. వాళ్లు ఎలా మారారు ఎలాంటి పాత్రను ఎంచుకున్నారు అనేది హాట్ టాపిక్‌గా మారుతుంది. ఇప్పుడు, అలాంటి ఒక పవర్‌ఫుల్ కమ్‌బ్యాక్‌కు రంగం సిద్ధమైంది. ఇక ఆ రీ ఎంట్రీ మరెవరిదో కాదు.. ఫైర్ బ్రాండ్ ఒకప్పటి గ్లామరస్ క్విన్ రోజా.
ఆమె ఒకప్పటి స్టార్ హీరోయిన్. 90లలో తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోలందరి సరసన నటించి, 100కు పైగా సినిమాలతో తనకంటూ ఒక లెగసీని క్రియేట్ చేసుకున్నారు. గ్లామర్ పాత్రలైనా, పవర్‌ఫుల్ రోల్స్ అయినా అలవోకగా పోషించి, '90s క్వీన్'గా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత, ఆమె ప్రయాణం పూర్తిగా మలుపు తిరిగింది.
ఫైర్ బ్రాండ్ నటి, వైసీపీ నేత ఆర్కే రోజా. దశాబ్దానికి పైగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె, రాజకీయాల్లో ఫుల్ యాక్టివ్ అయ్యారు. ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. ఇక ఆమె మళ్లీ సినిమాల్లోకి రారని అందరూ ఫిక్స్ అయిపోయిన టైమ్‌లో, ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా 12 ఏళ్ల తర్వాత రోజా సిల్వర్ స్క్రీన్‌పైకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. రోజా తన రీ ఎంట్రీకి ఒక తమిళ చిత్రాన్ని ఎంచుకున్నారు.
'లెనిన్ పాండియన్' అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బాలచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ అనౌన్స్‌మెంట్ వీడియోను టీమ్ రిలీజ్ చేసింది. "90s క్వీన్‌ను మళ్లీ సిల్వర్ స్క్రీన్‌కు తీసుకురావడం గౌరవంగా భావిస్తున్నాం" అని నిర్మాణ సంస్థ పేర్కొంది.
ఈ వీడియోలో రోజా ఫిల్మ్ కెరీర్‌ను, పొలిటికల్ జర్నీని బ్యూటిఫుల్‌గా చూపించారు. ఇక 'లెనిన్ పాండియన్'లో ఆమె లుక్‌ను కూడా రివీల్ చేశారు. ఈ చిత్రంలో ఆమె 'సంతానం' అనే పవర్‌ఫుల్ పాత్రలో, డీ గ్లామర్‌గా, చాలా సహజంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు గ్లామర్ ఐకాన్‌గా వెలిగిన రోజా, ఇప్పుడు ఇలాంటి పవర్‌ఫుల్ రోల్‌తో రీ ఎంట్రీ ఇవ్వడం ఆమె ఫ్యాన్స్‌కు ఖచ్చితంగా ఒక ట్రీట్. మొత్తం మీద, 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రోజా మళ్లీ మేకప్ వేసుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ముద్ర వేసిన ఆమె, ఇప్పుడు వెండితెరపై తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎలాంటి పాత్రలతో మెప్పిస్తారో చూడాలి.
