Begin typing your search above and press return to search.

బాలీవుడ్ డైరెక్ట‌ర్ వ‌ర్సెస్‌ మోస్ట్ వాంటెడ్!

అయితే ఈ సంఘ‌ట‌న‌కు గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కార‌ణ‌మ‌ని ముంబ‌యి వ‌ర్గాల్లో వినిపిస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ అని తెలుస్తోంది.

By:  Tupaki Entertainment Desk   |   3 Feb 2026 9:00 PM IST
బాలీవుడ్ డైరెక్ట‌ర్ వ‌ర్సెస్‌ మోస్ట్ వాంటెడ్!
X

బాలీవుడ్ సెల‌బ్రిటీల చుట్టూ ఏం జ‌రుగుతోంది?..వారికి సంబంధించిన ఇళ్ల‌పై అగంత‌కులు ఎందుకు గుళ్ల వ‌ర్షం కురిపిస్తున్నారు?..ఈ సంఘ‌ట‌న‌ల వెనుక అగంత‌కులు ఉన్నారా? లేక గ్యాంగ్ స్ట‌ర్స్ ఉన్నారా? అన్న‌ది ఇప్పుడు బాలీవుడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్‌లో ఈ మ‌ధ్య కాల్పుల ఘ‌ట‌న‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. స‌ల్మాన్ ఖాన్ టు రోహిత్ శెట్టి వ‌ర‌కు కాల్పుల ఉదంతాలు అంద‌రిని క‌ల‌వ‌రానికి గురి చేస్తున్నాయి నెండేళ్ల క్రితం స‌ల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్ స‌మీపంలో అగంత‌కులు కాల్పులు జ‌ర‌ప‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది.

దీని వెన‌క ఎవ‌రున్నారా అని ముంబాయి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్న క్ర‌మంలో మోస్ట్ వాంటెడ్ లారెన్స్‌ బిష్ణోయ్‌కి చెందిన గ్యాంగ్ ఇది త‌మ ప‌నేన‌ని ప్ర‌క‌టించుకుని షాక్ ఇచ్చింది. స‌ల్మాన్ ఖాన్ ని కృష్ణ జింక‌ల ఉదంతం నుంచి ఈ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వెంటాడుతోంది. ఎప్ప‌టికైనా తామే అంతం చేస్తామ‌ని స‌ల్మాన్‌కు చాలా సార్లు వార్నింగ్ కూడా ఇవ్వ‌డంతో త‌న‌కు సెక్యూరిటీని రాష్ట్ర ప్ర‌భుత్వం పెంచేసింది. ఆ త‌రువాత అదే త‌ర‌హాలో ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని హాట్ బ్యూటీ దిషా ప‌టానీకి సంబంధించిన హోమ్‌లో కాల్పుల ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది.

అయితే దీని వెన‌క ఎవ‌రున్నార‌ని అంతా షాక్‌కు గుర‌య్యారు. అయితే ఈ కాల్పుల ఘ‌ట‌న వెనుక గోల్డీ బ్రార్ గ్యాంగ్ ఉన్న‌ట్టుగా పోలీసులు తేల్చారు. ఎల్విష్ యాద‌వ్‌, కంగ‌న ర‌నౌత్ హౌస్‌, ఏపీ దిల్లాన్ క‌పిల్ శ‌ర్మ రెస్టారెంట్ ఫైరింగ్‌..ఇలా ప‌లువురు బాలీవుడ్ స్టార్స్‌, ఆల్బ‌మ్ స్టార్స్‌పై వ‌రుస కాల్పుల ఘ‌ట‌న‌లు దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించాయి. తాజాగా బాలీవుడ్ యాక్ష‌న్ మూవీస్ డైరెక్ట‌ర్ రోహిత్ శెట్టి నివాసం వ‌ద్ద కాల్పులు జ‌ర‌గ‌డం బాలీవుడ్ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ఆదివారం తెల్ల‌వారు జామున న‌గ‌రంలోని జుహూ ప్రాంతంలోని రోహిత్ శెట్టి నివాసం వ‌ల్ల కాల్పులు జ‌రిగాయి.

కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు నాలుగు రౌండ్లు కాల్పులు జ‌రిపార‌ని పోలీసులు తేల్చారు. దీనిపై ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు జ‌రుగుతోంది. అయితే కాల్పుల స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టి ఇంట్లో ఉన్నారా? లేరా? అనే దానిపై స్ప‌ష్ట‌త రాలేదు. అయితే కాల్పుల ఘ‌ట‌న నేప‌థ్యంలో ముంబ‌యి పోలీసులు రోహిత్ శెట్టి ఇంటి వ‌ద్ద భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు. అయితే ఈ సంఘ‌ట‌న‌కు గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కార‌ణ‌మ‌ని ముంబ‌యి వ‌ర్గాల్లో వినిపిస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ అని తెలుస్తోంది.

ఈ ఎఫ్ఐఆర్‌లో ప‌లు కీల‌క అంశాల‌ని వెల్ల‌డించార‌ట‌. రోహిత్ శెట్టి నివ‌సించే రూమ్ ప‌రిస‌రాల్లోనే ఎక్కువ‌గా ఫైరింగ్ జ‌రిగిన‌ట్టుగా అందులో పేర్కొన్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రోహిత్ శెట్టి బాడీగార్డ్ స్ప‌ష్టం చేయ‌డ‌మే కాకుండా కేసు ఫైల్ చేయించాడ‌ని చెబుతున్నారు. అయితే తాజా ఇష్యూ వెన‌క మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్ట‌ర్ లారెన్స్ బిష్టోయ్ గ్యాంగ్ ఉంద‌ని తేలింది. రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల‌కు కార‌ణం తామేని లారెన్స్ గ్యాంగ్ ప్ర‌క‌టించ‌డంతో అప్ప‌మ‌త్త‌మైన పోలీసులు కాల్పుల‌కు కార‌ణ‌మైన వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే లారెన్స్ గ్యాంగ్ రోహిత్ శెట్టిని టార్గెట్ చేయ‌డం ఇప్పుడు అంద‌రిని షాక్‌కు గురి చేస్తోంది.