విమర్శలు+ ప్రశంసల మధ్య కాఫ్ స్టోరీతో కంబ్యాక్!
కాఫ్ స్టోరీల బ్రాండ్ అంబాసిడర్ అయిన రోహిత్ శెట్టి ఇంత వరకూ ఫిక్షన్ పోలీస్ కథల్నే వెండి తెరపై ఆవిష్కరిం చాడు.
By: Srikanth Kontham | 19 Jan 2026 8:00 AM ISTకాఫ్ స్టోరీల బ్రాండ్ అంబాసిడర్ అయిన రోహిత్ శెట్టి ఇంత వరకూ ఫిక్షన్ పోలీస్ కథల్నే వెండి తెరపై ఆవిష్కరిం చాడు. వాటిని కమర్శియల్ గా సక్సెస్ చేయడంలో వందశాతం సక్సెస్ అయ్యాడు. `సింగం` ను బాలీవుడ్ లో ఓ ప్రాం చైజీగా మలిచి పెద్ద విజయాలు అందుకున్నాడు. కానీ రియల్ పోలీస్ స్టోరీలను టచ్ చేసింది లేదు.
అలాంటి డైరెక్టర్ రియల్ బాస్ ల జోలికి వెళ్తే ఇంకే రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవలే ముంబై కమీషనర్ రాకేష్ మారియా బయోపిక్ బాధ్యతలు తీసుకున్నారు. రాకేష్ పాత్రలో జాన్ అబ్రహం నటిస్తున్నాడు. ప్రస్తుతం సినిమా ఆన్ సెట్స్ లో ఉంది.
అయితే ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ నిర్ణయిస్తారు? అన్న దానిపై కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతుంది. వాస్తవ కథ నేపథ్యంలో ఈ బజ్ నెలకొంది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్సైంది. ఈ చిత్రానికి `మారియా ఐపిఎస్` అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. టైటిల్ క్యాచీగా ఉంది. కమర్శియల్ గానూ బాగా పాపులర్ అవ్వడానికి అవకాశం ఉంది. పక్కా కమర్శియల్ సినిమా చూస్తున్న అనుభూతిని పంచుతుందని గెస్సింగ్స్ తెరపైకి వస్తు న్నాయి. సాధారణంగా బాలీవుడ్లో బయోపిక్ లు అంటే చాలా రియలిస్టిక్ గా ఉంటాయి.
కమర్శియల్ యాస్పెక్ట్ కి పెద్దగా ఛాన్స్ తీసుకోరు. కానీ రోహిత్ శెట్టి మాత్రం కమర్శయల్ గా కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో కాప్ స్టోరీలను తెరకెక్కించిన అనుభవం ఈ సినిమాకు పనికొస్తుంది. ఆసక్తికర కథనంతో పరుగులు పెట్టిస్తుందని వార్తలొస్తున్నాయి. షూటింగ్ అప్ డేట్ విషయానికి వస్తే? షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. త్వరలోనే టైటిల్ పై అధికారికంగా ప్రకటన ఇచ్చి రిలీజ్ తేదీ వెల్లడించనున్నారని బాలీవుడ్ సోర్సెస్ చెబుతున్నాయి. అలాగే రోహిత్ శెట్టి కల్పిత కథల కంటే ఇలాంటి వాస్తవ గాథలను తెరకెక్కించాలని కొందరు అభిప్రాయపడుతున్నారు. జాన్ అబ్రహం నటనలోని అసలైన సత్తా ఈ సినిమాతో బయటపడుతుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు.
అలాగే కొంత నెగిటివిటీ కూడా వ్యక్తమవుతోంది. రోహిత్ శెట్టి ఇకనైనా పోలీస్ కథలను వదిలేసి, ఇతర అంశాలపై దృష్టి పెట్టాలని మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్ సినిమాలు తీసినా, కొత్త సబ్జెక్టులతో, వినూత్నంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా రోహిత్ పరాజయాల్ని గుర్తు చేస్తున్నారు. 2018 వరకు దేశంలోని టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న రోహిత్ శెట్టి, అటుపై తెరకెక్కించిన `సర్కస్`, `సింగం అగైన్` లాంటి వరుస ప్లాప్ లతో ఫాం కోల్పోయాడు అన్నది అంతే వాస్తవం. మరి ఈ విమర్శలను తిప్పి కొట్టాలంటే రోహిత్ హిట్ తోనే సమాధానం చెప్పాలి.
