Begin typing your search above and press return to search.

నారా వార‌బ్బాయి డైరెక్ట‌ర్ గానా?

నారా వార‌సుడు రోహిత్ ప‌రిచ‌యం అస‌వ‌రం లేని పేరు. 'బాణం' తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ క‌థాబ‌లం ఉన్న చిత్రాల్లో న‌టించి న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు.

By:  Srikanth Kontham   |   27 Sept 2025 10:00 PM IST
నారా వార‌బ్బాయి డైరెక్ట‌ర్ గానా?
X

నారా వార‌సుడు రోహిత్ ప‌రిచ‌యం అస‌వ‌రం లేని పేరు. `బాణం` తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోహిత్ క‌థాబ‌లం ఉన్న చిత్రాల్లో న‌టించి న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నాడు. రెగ్యుల‌ర్ క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌కు భిన్నంగా రోహిత్ క‌థ‌లు ఎంచుకోవ‌డ‌మే అత‌డి ప్ర‌త్యేక‌గా క‌నిపిస్తుంది. వైవిథ్య‌మైన పాత్ర‌ల‌తో త‌న‌కంటూ ఓ స్పెషాల్టీ ఉంద‌ని ప్రూవ్ చేసాడు. తెలుగు సినిమా క‌మ‌ర్శియ‌ల్ పంథాలో ఉన్న రోజుల్లో ఇలాంటి క‌థ‌ల‌తో సినిమాలు చేయ‌డం అంటే రిస్క్ అయినా? సాహ‌సించి స‌క్సెక్స్ అయిన న‌టుడు.

ఆరేళ్ల‌లో మూడు సినిమాలే:

క‌మ‌ర్శియ‌ల్ గా పెద్ద స్టార్ కాన‌ప్ప‌టికీ స్టోరీల ఎంపిక‌ల్లో తానో యూనిక్. న్యూయార్క్ ఫిల్మ్ అకాడ‌మీలో కోర్స్ చేసిన అనుభ‌వం కూడా రోహిత్ కు ఉంది. 2018 వ‌ర‌కూ యాక్టివ్ గా సినిమాలు చేసాడు. ఆ త‌ర్వాత ఒక్క సారిగా స్పీడ్ త‌గ్గించాడు. 2018-25 మ‌ధ్య‌లో మూడు సినిమాలు మాత్ర‌మే చేసాడు. 'ప్ర‌తినిధి2' గ‌త ఏడాది రిలీజ్ అయింది. 'భైర‌వం', 'సుంద‌ర‌కాండ' సినిమాలు ఇదే ఏడాది రిలీజ్ అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఇక‌పై గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తాన‌ని వెల్ల‌డించాడు. తాజాగా రోహిత్ గురించి మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది.

హ‌ద్దులు లేకుండా ప‌నిచేయోచ్చు:

నారా వార‌బ్బాయి క్రియేటివ్ రంగంలో రాణించే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్లు తెలిసింది. రైట‌ర్ గా, డైరెక్ట‌ర్ గా త‌న ఫ్యాష‌న్ ని ప్రూవ్ చేసుకోవాల‌ని చూస్తున్నాడుట‌. కొన్నాళ్ల పాటు హీరో అనే ఇమేజ్ ని ప‌క్క‌న బెట్టి కెప్టెన్ కుర్చీ ఎక్కి సినిమాల‌ను డైరెక్ట్ చేయాల‌నుకుంటున్నాడుట‌. హీరోగా తాను సాధించ‌లేనిది డైరెక్ట‌ర్ గా సాధించాల‌ని ఆశ ప‌డుతున్నాడుట‌. హీరో అంటే డైరెక్ట‌ర్ చెప్పిన‌ట్లు చేయాల్సి ఉంటుంది. సెట్ లో అత‌డి ఏం చెబితే అది చేయాలి త‌ప్ప త‌న ఐడియాల‌జీ పూర్తిగా వ‌ర్కౌట్ చేయ‌డానికి వీలుండ‌దు.

క‌ష్ట‌ప‌డితే మంచి ఫ‌లితం:

ఈ నేప‌థ్యంలో డైరెక్ట‌ర్ గా మారితే ఆ లిబ‌ర్టీ దొరుకుతుంద‌ని రోహిత్ భావిస్తున్న‌ట్లు స‌న్నిహితుల నుంచి లీకులందు తున్నాయి. త‌న మ‌న‌సులో ఉన్న భ‌వాల‌ను పేప‌రు పై పెట్టి దానికి అద్బుత‌మైన దృశ్య‌రూపాన్ని ఇవ్వ గ‌లిగితే? వండ‌ర్స్ క్రియేట్ చేయోచ్చ‌ని భావిస్తున్నాడుట‌. ఈ విష‌యంలో రోహిత్ ని స‌న్నిహితులు కూడా ప్రోత్స‌హిస్తున్నారు ట‌. త‌న‌లో ఉన్న యూనిక్ క్వాలిటీని క‌థ‌ల రూపంలో బ‌య‌ట‌కు తీసుకు రాగ‌లిగితే? మంచి కంటెంట్ రెడీ అవు తుంది. సక్సెస్ అయితే ఇండ‌స్ట్రీలో నారా వారి పేరు మారుమ్రెగుతుంది. అది జ‌ర‌గాలంటే? నారా వార‌సుడు శ‌క్తి వంచ‌న లేకుండా ప‌ని చేయాల్సిందే.