కొత్త జేమ్స్ బాండ్ ఎవరు?
కొత్త జేమ్స్ బాండ్ ఎంపికపై హాలీవుడ్‌లో ఆసక్తి పెరుగుతోంది. 26వ బాండ్ చిత్రంలో 007 పాత్ర కోసం రాబర్ట్ ప్యాటిన్సన్, నికోలస్ హౌల్ట్ స్క్రీన్ టెస్ట్ ఇచ్చినట్లు కథనాలు వస్తున్నాయి. కల్లమ్ టర్నర్, జోష్ ఓకాన్నర్, జాక్ లాడెన్, హ్యారీ స్టైల్స్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. డెనిస్ విల్లెనెవ్ దర్శకత్వంలో, అమెజాన్ ఎంజీఎం నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టీవెన్ నైట్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. కొత్త బాండ్ ఎవరనేది అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
By: Srikanth Kontham | 14 Nov 2026 12:23 PM ISTహాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా మొదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన `జేమ్స్ బాండ్` గురించి పరిచయం అవసరం లేదు. ఈసిరీస్ లో ఇప్పటివరకూ రిలీజ్ అయిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కోట్ల వసూళ్లను రాబ్టటాయి. అయితే కొంత కాలంగా కొత్త సిరీస్ బాండ్ ఎంపిక విషయం ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర ఎంపిక విషయంలో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. డేనియల్ క్రేగ్ 15 ఏళ్ల ప్రయాణానికి ముగింపు పలికిన తర్వాత బాండ్ ఫ్రాంచైజీకి సంబంధించి 26వ సినిమా కోసం కొత్త 007 ఎవరనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో తాజాగా హాలీవుడ్ స్టార్స్ రాబర్ట్ ప్యాటిన్సన్ , నికోలస్ హౌల్ట్ ఐకానిక్ పాత్ర కోసం స్క్రీన్ టెస్ట్‌లు ఇచ్చిన ప్రముఖుల జాబితాలో ఉన్నట్లు సమాచారం. డీసీ ఫ్రాంచైజీలో `ది బ్యాట్‌మ్యాన్` గా అద్భుతమైన నటనతో అలరించిన రాబర్ట్ ప్యాటిన్సన్ ఒకప్పుడు `ట్వైలైట్`, `హ్యారీ పాటర్` సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన డెనిస్ విల్లెనెవ్ దర్శ కత్వంలో తెరకెక్కుతోన్న `డ్యూన్: పార్ట్ త్రీ` చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు `సూపర్ మ్యాన్` చిత్రంలో లెక్స్ లూథర్ పాత్రతో పాటు `ఎక్స్-మెన్` సిరీస్‌లో నటించిన నికోలస్ హౌల్ట్ కూడా బాండ్ రేసులో పోటీదారుడిగా నిలిచారు. బాండ్ పాత్రకు ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు మీడియాలో కథనాలు రావడంతో? అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.
ఈ ప్రాజెక్ట్‌ను హాలీవుడ్‌లోని ప్రముఖ స్టూడియో అమెజాన్ ఎంజీఎం నిర్మిస్తుండగా `డ్యూన్` ఫేమ్ డెనిస్ విల్లెనెవ్ దర్శకత్వం వహించనున్నారు. అలాగే సంచలన సిరీస్ `పీకీ బ్లైండర్స్` సృష్టికర్త స్టీవెన్ నైట్ ఈ సినిమాకు స్క్రిప్ట్ అందిస్తున్నారు. ప్రసిద్ధ నిర్మాతలు ఆల్ పాస్కల్, డేవిడ్ హేమన్ ప్రాజెక్ట్‌ను పర్యవేక్షిస్తున్నారు. దీంతో కాస్టింగ్ ఎంపికపై అంచనాలు పీక్స్ కు చేరుతున్నాయి. ప్రధాన నటులతో పాటు కల్లమ్ టర్నర్, జోష్ ఓకాన్నర్, జాక్ లాడెన్ వంటి పేర్లు కూడా బాండ్ పాత్ర రేసులో ఇప్పటికే ఉన్నాయి.
ప్రముఖ సింగర్-యాక్టర్ హారీ స్టైల్స్ కూడా ఈ పాత్రపై చర్చలు జరిపినట్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకుముందు జేమ్స్ బాండ్‌గా నటించిన పియర్స్ బ్రాస్‌నన్.. కల్లమ్ టర్నర్‌కు మద్దతు తెలపగా.. దిగ్గజ నటుడు గ్యారీ ఓల్డ్‌మన్ మాత్రం తదుపరి బాండ్ ఎవరనేది ఇప్పటికే ఖరారైందని అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
డేనియల్ క్రేగ్ `కాసినో రాయల్` నుండి `నో టైమ్ టు డై` వరకు ఐదు సినిమాలతో జేమ్స్ బాండ్ పాత్రకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు. ఆ స్థాయికి తగ్గట్టుగా తాజాగా తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో బాండ్ కోటు ఎవరికి దక్కు తుందనేది ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే దీనిపై యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
