Begin typing your search above and press return to search.

కొత్త జేమ్స్ బాండ్ సినిమాలో విలన్‌గా బ్రాడ్ పిట్?

రాబర్ట్ పాటిన్సన్ కొత్త జేమ్స్ బాండ్‌గా ఎంపిక కావడంపై బ్రాడ్ పిట్ ప్రశంసలు కురిపించారు. ఆయన కెరీర్‌లో తీసుకుంటున్న భిన్నమైన నిర్ణయాలు నచ్చాయని అన్నారు. డెనిస్ విల్లెనెవ్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో విలన్ పాత్రకు తనను కూడా పరిగణించాలని సరదాగా వ్యాఖ్యానించారు.

By:  Srikanth Kontham   |   18 Nov 2026 12:43 PM IST
కొత్త జేమ్స్ బాండ్ సినిమాలో విలన్‌గా బ్రాడ్ పిట్?
X

హాలీవుడ్ మోస్ట్ ఐకానిక్ ఫ్రాంచైజీ `జేమ్స్ బాండ్` చిత్రంలో కొత్త 007 ఏజెంట్‌గా రాబర్ట్ పాటిన్సన్ ఎంపికవ‌డం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. డేనియల్ క్రెయిగ్ తర్వాత బాండ్ పాత్రను ఎవరు పోషిస్తారనే? ఉత్కంఠకు తెరదించుతూ మేకర్స్ రాబర్ట్ పేరును ఖరారు చేశారు. ఈ నిర్ణయంపై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వ‌స్తున్నా? హాలీవుడ్ దిగ్గజ నటుడు బ్రాడ్ పిట్ మాత్రం ఎంపికపై ఎంతో ఉత్సాహంగా స్పందించారు. అలాగే ఈ సినిమాలో నటించడానికి తాను కూడా సిద్ధమేనంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో కొత్త జేమ్స్ బాండ్ గురించి బ్రాడ్ పిట్ అభిప్రాయాలను పంచుకున్నారు. `ఇది నిజంగా గ్రేట్ ఛాయిస్. రాబర్ట్ కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న సినిమాలు.. అతను ఎంచుకుంటున్న భిన్నమైన కథలు నాకు చాలా ఇష్టం. అతను కెరీర్‌లో మేకింగ్ పరంగా చాలా ఆసక్తికరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు` అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. ఓ వైపు కమర్షియల్ హంగులు.. మరోవైపు ప్రయోగాత్మక పాత్రలను బ్యాలెన్స్ చేయడంలో రాబర్ట్ ఎంతో ప్రతిభావంతుడని కొనియాడారు.

ఈ సినిమాకు సంబంధించి బ్రాడ్ పిట్ సరదాగా చేసిన ఓ వ్యాఖ్య అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాబర్ట్ బాండ్ పాత్ర చేస్తుంటే ఈ సినిమాలో విలన్ రోల్ ఎవరు చేస్తారనే చర్చపై బ్రాడ్ పిట్ ఓపెన్ అయ్యారు. `ఆ సినిమాలో విలన్ పాత్ర కోసం నన్ను కూడా పరిగణించండి. డైరెక్టర్ డెనిస్ విల్లెనెవ్‌కు ఫోన్ చేసి మాట్లాడండి. నేను ఆ రోల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను` అంటూ ఉత్సాహం ప్రదర్శించారు. హాలీవుడ్ మాస్టర్ మైండ్ డైరెక్టర్ డెనిస్ విల్లెనెవ్ దర్శక త్వంలో రాబోతున్న ఈ చిత్రంలో బ్రాడ్ పిట్ లాంటి గ్రేట్ యాక్టర్ విలన్‌గా కనిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఈ విష‌యాన్ని స‌ద‌రు ద‌ర్శ‌కుడు సీరియ‌స్ గా తీసుకుని ఫిట్ని విల‌న్ గా ఎంపిక చేయాల‌ని సోష‌ల్ మీడియాలో అభిమానులు కోరుతున్నారు.

రాబర్ట్ పాటిన్సన్ బాండ్‌గా .. బ్రాడ్ పిట్ కనుక విలన్‌గా రంగంలోకి దిగితే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా సరికొత్త సంచలనాలు సృష్టించడం ఖాయం. హాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్స్ స్టార్స్ ఒకే స్క్రీన్‌పై తలపడితే ఎలా ఉం టుందనే ఊహే అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. మరి బ్రాడ్ పిట్ కోరికను మేకర్స్ మన్నించి నిజంగానే ఆయన్ని విలన్ రోల్‌కు తీసుకుంటారా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.