Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ గ్లోబ‌ల్ పీఆర్ కంప‌నీ కార‌ణ‌మా?

`పుష్ప‌` పాట‌ల‌కు గ్లోబ‌ల్‌గా క్రేజ్ ద‌క్క‌డానికి ప్ర‌ధాన కార‌ణం అల్లు అర్జున్ గ్లోబ‌ల్ పీఆర్‌.

By:  Ravindar Gorantla   |   1 April 2026 1:00 AM IST
అల్లు అర్జున్ గ్లోబ‌ల్ పీఆర్ కంప‌నీ కార‌ణ‌మా?
X

`పుష్ప‌` పాట‌ల‌కు గ్లోబ‌ల్‌గా క్రేజ్ ద‌క్క‌డానికి ప్ర‌ధాన కార‌ణం అల్లు అర్జున్ గ్లోబ‌ల్ పీఆర్‌. దాని కార‌ణంగానే ప్ర‌ముఖ సెల‌బ్రిటీలు సైతం పుష్ప‌` పాట‌ల‌కు రీల్స్ చేసి వాటిని వైర‌ల్ అయ్యేలా చేశారు. బ‌న్నీని పాన్ ఇండియా వైడ్‌గా క్రేజీ స్టార్‌గా మారేలా చేశారు. దేశ వ్యాప్తంగా బ‌న్నీ పేరు మారు మారుమోగేలా చేశారు. ఇప్పుడు ఇదే స్ట్రాట‌జీని అల్లు శిరీష్ కోసం కూడా ఉప‌యోగిస్తున్నారా? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే స‌మాధానం అందిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే.. రీసెంట్‌గా అల్లు శిరీష్ మ్యారేజ్ న‌య‌నిక రెడ్డితో జ‌రిగింది.

మార్చి 6న అల్లు శిరీష్‌, న‌య‌నిక రెడ్డిల వివాహం అంగ‌రంగ వైభ‌వంగ జ‌రిగింది. అల్లు శిరీష్‌, న‌య‌నిక రెడ్డి గ‌త కొన్నాళ్లుగా ప్రేమ‌లో ఉన్నారు. నితిన్ వైఫ్ షాలినికి న‌య‌నిక బెస్ట్ ఫ్రెండ్‌. వ‌రుణ్ తేజ్‌- లావ‌ణ్య త్రిపాఠిల పెళ్లి పార్టీలో తొలిసారి వీరిద్ద‌రికి ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి పెళ్లి పీట‌లెక్కి వివాహ బంధంతో ఒక్క‌టైంది. ఇదిలా ఉంటే అమెరిక‌న్ లైఫ్ స్టైల్ మ్యాగ‌జైన్ `రాబ్ రిపోర్ట్‌` భార‌తీయ ఎడిష‌న్ ఇప్పుడు అల్లు శిరీష్ - న‌య‌నిక జంట కార‌ణంగా వార్త‌ల్లో నిలుస్తోంది.

ఇండియ‌న్ ఎడిష‌న్ ద్వారా భార‌తదేశంలోని విలాస‌వంత‌మైన జీవితం, ఫ్యాష‌న్ అండ్ జీవ‌న‌శైలి గురించి ప్ర‌త్యేకంగా ఇండియ‌న్ ఎడిష‌న్‌లో ప్ర‌త్యేకంగా రాయాల‌నుకుంటున్నారు. ఇందు కోసం వారు ఎంచుకున్న మొద‌టి సెల‌బ్రిటీ అల్లు శిరీష్ ఆ కార‌ణంగానే అమెరిక‌న్ లైఫ్ స్టైల్ మ్యాగ‌జైన్ `రాబ్ రిపోర్ట్‌` నెట్టింట వైర‌ల్ అవుతోంది. రీసెంట్‌గా వివాహం జ‌రుపుకున్న క్రేజీ జోడీ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మ‌క మంద‌న్న‌ల‌ని కాద‌ని ప్ర‌త్యేకంగా శిరీష్ జంట‌ని ఎంచుకోవ‌డానికి కార‌ణం ఏంటీ అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

అల్లు శిరీష్ పెద్ద స్టార్ కాదు. పేరున్న సినిమాలు ఏవీ చేయ‌లేదు. త‌న‌కున్న ఒకే ఒక్క అర్హ‌త అల్లు అర‌వింద్ త‌న‌యుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోద‌రుడు అంతే. కానీ హీరోగా ఎలాంటి క్రేజ్‌ని ద‌క్కించుకోని, బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకోని శిరీష్‌ని ప్ర‌ధానంగా ఎంచుకోవ‌డానికి కార‌ణం ఏంట‌ని అంతా అవాక్క‌వుతున్నారు. శిరీష్ కంటే పేరున్న స్టార్స్ ఉండ‌గా అమెరిక‌న్ లైఫ్ స్టైల్ మ్యాగ‌జైన్ `రాబ్ రిపోర్ట్‌` త‌న‌నే ఎంచుకోవ‌డానికి కార‌ణం ఏంట‌ని ఆరాతీస్తే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

అదే అల్లు అర్జున్ గ్లోబ‌ల్ పీఆర్ టీమ్‌. హీరోగా స‌క్సెస్ కాలేక‌పోయిన శిరీష్‌ని ఓ స్టార్ ప్రొడ్యూస‌ర్‌గా లాంచ్ చేయాలనే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ట‌. దానికి ముందే గ్లోబ‌ల్ రేంజ్ మ్యాగ‌జైన్‌లో ప్ర‌ముఖంగా క‌నిపించాల‌ని బ‌న్నీ గ్లోబ‌ల్ పీఆర్ టీమ్ ఇలా ప్లాన్ చేస్తోంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. బ‌న్నీ కోస‌మే పీఆర్ టీమ్ ఇతంతా చేస్తోంద‌ని మ‌రి కొంత మంది కామెంట్‌లు చేస్తున్నారు.