Begin typing your search above and press return to search.

వేరొక‌రి భ‌ర్త‌ను దొంగిలించిన అందాల‌ RJ

క్రికెట‌ర్ చాహ‌ల్ నుంచి కొరియోగ్రాఫ‌ర్ వైఫ్ ధ‌న‌శ్రీ విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే.

By:  Sivaji Kontham   |   30 July 2025 9:16 AM IST
వేరొక‌రి భ‌ర్త‌ను దొంగిలించిన అందాల‌ RJ
X

క్రికెట‌ర్ చాహ‌ల్ నుంచి కొరియోగ్రాఫ‌ర్ వైఫ్ ధ‌న‌శ్రీ విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. చాహ‌ల్- ధ‌న‌శ్రీ జంట విడాకుల వ్య‌వ‌హారం, భ‌ర‌ణం వ‌గైరా ఇటీవ‌ల విస్త్ర‌తంగా చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. చాహ‌ల్ 4.8 కోట్లు త‌న మాజీ భార్య‌కు చెల్లించాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. నిజానికి ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. కానీ కొద్దిరోజుల‌కే విడిపోవ‌డం అభిమానులను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ధ‌న‌శ్రీ నుంచి చాహ‌ల్ విడిపోవ‌డానికి ఆర్జే మ‌హ్వాష్ తో స్నేహం కార‌ణం అంటూ ఒక సెక్ష‌న్ సోష‌ల్ మీడియాల్లో ప్ర‌చారం చేస్తోంది.

దీనిపై ఆర్జే మ‌హ్వాష్ సీరియ‌స్ గా స్పందిస్తున్నా, ఈ పుకార్లు ఆగ‌డం లేదు. ఇప్పుడు `ఒక‌రి భ‌ర్త‌ను దొంగిలించిన ఆర్జే` అంటూ సోష‌ల్ మీడియాల్లో సెటైర్లు ప‌డుతున్నాయి. అయితే ఈ వివాదంపై ఆర్జే మ‌హ్వాష్ స్పందిస్తూ సోష‌ల్ మీడియాల్లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. మహ్వాష్ ఇటీవల త‌న‌ ఇన్‌స్టాలో మోసం అంటే ఏమిటో వివ‌రిస్తూ, ఒక వీడియోని, సుదీర్ఘ వ్యాసాన్ని పోస్ట్ చేశారు.

ఎవ‌రి క‌ర్మ వారిది:

``ఇది మోసానికి స‌రైన‌ త‌రుణం.. రిలేష‌న్‌షిప్ లో ఇవ‌న్నీ చేయ‌డం మోసం.. అలా చేస్తే, ఎవ‌రి క‌ర్మ వారిది.. వారిని వ‌దిలేయండి.. మీరంతా ఎందుకు నిరాశ‌కు గుర‌వుతున్నారు?`` అని మ‌హ్వాష్ పోస్ట్ చేసారు. మోసం చేసేవాళ్లు ప్ర‌తిరోజు త‌మ‌ను న‌మ్మే వ్య‌క్తుల‌ను మోసం చేస్తార‌ని కూడా మ‌హ్వాష్ త‌న పోస్ట్ లో పేర్కొన్నారు. తాను కూడా గ‌తంలో మోస‌పోయాన‌ని, అలాంటి వ్య‌క్తుల‌ను రెండోసారి క్ష‌మించ‌కూడ‌ద‌ని కూడా మ‌హ్వాష్ వ్యాఖ్యానించారు. రెండోసారి అగౌర‌వం వ‌ద్దు.. వారి కంటే మ‌న‌మే ఉత్త‌మంగా జీవించ‌గ‌ల‌ర‌ని మ‌హ్వాష్ పేర్కొన్నారు.

బ‌ర్త్ డేలో వెచ్చ‌ని కౌగిలింత‌:

ధ‌న‌శ్రీ నుంచి చాహ‌ల్ విడిపోతున్న క్ర‌మంలో ఇంకా కోర్టు విడాకులు మంజూరు చేయ‌క ముందే అందాల‌ ఆర్జే మ‌హ్వాష్ తో చాహ‌ల్ స‌న్నిహితంగా క‌నిపించాడు. ఈ జంట బ‌హిరంగంగా క్రికెట్ స్టేడియంలో సంద‌డి చేస్తూ స‌న్నిహితంగా క‌నిపించారు. ఆ త‌ర్వాత కూడా ప‌లు ఈవెంట్ల‌లో జంట‌గా క‌నిపించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇటీవ‌లే లండ‌న్ లో బ‌ర్త్ డే జ‌రుపుకున్న చాహ‌ల్ ని హ‌గ్ చేసుకుని ఆర్జే మ‌హ్వాష్ మ‌రోసారి సందేహాల్ని రాజేసింది. అయితే ఈ జంట అధికారికంగా త‌మ రిలేష‌న్ షిప్ ని ధృవీక‌రించ‌డం లేదు. ఇప్ప‌టికీ మేము మంచి స్నేహితులం మాత్ర‌మేన‌ని చెబుతున్నారు.