Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా స్టార్స్.. బిగ్ బాస్ కి పనికిరారా?

ముంబై నీట్ నిరసనలతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా ట్రెండ్ అయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రియా అహిర్‌కు బిగ్‌బాస్ వేదికపై ఊహించని షాక్ తగిలింది.

By:  Madhu Reddy   |   7 Sept 2026 3:24 PM IST
సోషల్ మీడియా స్టార్స్.. బిగ్ బాస్ కి పనికిరారా?
X

ముంబై నీట్ నిరసనలతో రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా ట్రెండ్ అయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రియా అహిర్‌కు బిగ్‌బాస్ వేదికపై ఊహించని షాక్ తగిలింది. బిగ్‌బాస్ హిందీ కొత్త సీజన్ గ్రాండ్ ప్రీమియర్ స్టేజీపైకి అడుగుపెట్టిన రెండు నిమిషాల వ్యవధిలోనే ఆమె ఎలిమినేట్ అయి ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది. మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న ఒక సోషల్ మీడియా సెన్సేషన్‌కు ఈ రేంజ్ రిజెక్ట్ ఎదురవ్వడం వెనుక ఉన్న అసలు కారణాలపై నెటిజన్లు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు.

2 నిమిషాల్లోనే గ్రాండ్ ఎలిమినేషన్:

సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ నిర్వాహకులు ఈసారి 'ఫ్యాన్స్ కా ఫైస్లా' పేరుతో సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. పంజాబీ నటి లవ్ గిల్, రియా అహిర్ మధ్య ఒకరినే హౌస్‌లోకి పంపాలని నిర్ణయించి ఆన్‌లైన్ ఓటింగ్ పెట్టారు. అయితే స్టేజ్ పైనే వీరిద్దరి మధ్య కాసేపు గట్టి వాగ్వాదం కూడా నడిచింది. ఇక ఆ తర్వాత వచ్చిన ఓటింగ్ ఫలితాల్లో లవ్ గిల్‌కు ఎక్కువ మద్దతు రావడంతో ఆమె హౌస్‌లోకి వెళ్లగా, రియా మాత్రం తీవ్ర నిరాశతో స్టేజ్ పైనుంచే వెనుదిరగాల్సి వచ్చింది.

మిలియన్ల ఫాలోవర్లు ఉన్నా ఓట్లు పడలేదా? :

రియా అహిర్ నేతృత్వం వహించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' సోషల్ మీడియాలో ఏ స్థాయిలో సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ పేజీ లాంచ్ చేసిన రోజే ఏకంగా 20 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు వచ్చారు. ఇక నీట్ నిరసనల్లో ముంబై వీధుల్లో ఆమె చేసిన రచ్చతో దేశమంతా ఆమె పేరు మారుమోగిపోయింది. అంతటి భారీ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ బిగ్‌బాస్ ప్రత్యక్ష ఓటింగ్‌లో ఆమెకు కనీస మద్దతు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఆ పార్టీ హ్యాండ్ ఇచ్చిందా?:

ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. అంతమంది ఫాలోవర్లు ఉన్న 'కాక్రోచ్ జనతా పార్టీ' సపోర్టర్లు రియాకు అసలు ఓట్లు వేయలేదా లేదా కేవలం సోషల్ మీడియా హైప్ మాత్రమే ఉండి నిజమైన అభిమానులు లేరా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరైతే ఆమె చేసిన రాజకీయ, నీట్ నిరసనల నిరసనల కారణంగా బిజెపి మద్దతుదారులు లేదా వ్యతిరేకులు కావాలనే ఆమెకు ఎగైనెస్ట్‌గా ఓట్లు వేశారంటూ విశ్లేషణలు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్, ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన బిగ్‌బాస్ లాంటి రియాలిటీ షోలలో నెగ్గుకు రావడం సాధ్యం కాదని ఈ ఘటన నిరూపించింది. ఎంత పెద్ద వైరల్ సెన్సేషన్ అయినా, నిజమైన ఆడియన్స్ కనెక్టివిటీ మరియు ఓటింగ్ పవర్ లేకపోతే కనీసం హౌస్‌లో అడుగుపెట్టడం కూడా కష్టమేనని రియా అహిర్ ఉదంతం స్పష్టం చేస్తోంది.