సైట్ కొడితే పక్కకు పిలిచి కుమ్మేస్తానంటోంది!
ముంబై బ్యూటీ రితికా సింగ్ సుపరిచిమతే. 'గురు'..'నీవెవరో' లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
By: Srikanth Kontham | 29 Sept 2025 5:00 AM ISTముంబై బ్యూటీ రితికా సింగ్ సుపరిచిమతే. 'గురు'..'నీవెవరో' లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవలే రిలీజ్ అయిన `కింగ్ ఆఫ్ కొత్త` సినిమాలోనూ నటించింది. తమిళ్, మలయాళ చిత్రాల్లోనూ పనిచేసింది. కానీ ఏ భాషలోనూ బిజీ నటిగా మారలేకపోయింది. అందం, అభినయం గల నాయికే అయినా అవకాశాలు అందుకోవడంలో వెనుకబడింది. పోటీని తట్టుకుని మార్కెట్ లో నిలబడలేకపోతుంది. ఈ మధ్య కాలంలో అమ్మడు నటించిన సోలో చిత్రాలేవి రిలీజ్ కాలేదు. చివరిగా రజనీకాంత్ నటించిన `వెట్టేయాన్` లో నటించింది.
ఆ తర్వాత రితిక అడ్రస్ లేదు. కానీ ఈ బ్యూటీలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అమ్మడు మిక్స్ డు మార్సల్ ఆర్స్ట్ లో శిక్షణ తీసుకుంది. చిన్న వయసు నుంచే మార్షల్ ఆర్స్ట్ లో తర్పీదు పొందింది. ఆ ట్యాలెంట్ తోనే `గురు`లో బాక్సర్ పాత్రకు ఎంపికైంది. కానీ తాను రియల్ లైఫ్ లోనూ రియల్ బాక్సర్ అన్నది చాలా తక్కువ మందికే తెలుసు. మహిళలపై దాడులు జరిగిన సమయంలో సోషల్ మీడియాలో తప్పక స్పందిస్తుంది. స్వీయా రక్షణపై అవగాహన కల్పిస్తుంటుంది. ఈ క్రమంలో నేటి జనరేషన్ మహిళలంతా తప్పకుండా బాక్సింగ్ , కరాటే, కుంగూపూ లాంటివి నేర్చుకోవాలని సూచించింది.
ఇలాంటి విద్యలు తెలిస్తే తమను తాము కాపాడుకోగలుగుతారని ముందు జాగ్రత్త చెప్పింది. దేశంలో అత్యాచారాలు పెరుగుతోన్న వేళ ఇలాంటి విద్యలు తెలిస్తే వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నారు. అలాగే తనకు ఎవరైనా సైట్ కొట్టినట్లు అనిపిస్తే ఎలాంటి భయం లేకుండా అతడిని పక్కకు పిలిచి కుమ్మేస్తానంది. అలాంటి వాటిని చూస్తూ ఊరుకోనంది. ఛాన్స్ ఇస్తేనే ఎవరైనా చూస్తారని..ఆ ఛాన్సే ఇవ్వకుండా చేతి బలం చూపిస్తే? పిచ్చి పిచ్చి వేశాలు వేసే వారు భయపడతారంది.
మారుతోన్న రోజుల్లో మహిళలు కూడా అంతే మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది.ఈ బ్యూటీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలు షేర్ చేస్తూ కుర్ర కారులో సెగలు రేపుతుంది. చేతిలో సినిమాలు లేకపోయినా ఇప్పటికీ యువత అటెన్షన్ డ్రా చేస్తుందంటే? కారణం అమ్మ డిలో ఆ రకమైన యాంగిలే అని చెప్పాల్సిన పనిలేదు. ఇన్ స్టాలోనూ అమ్మడికి భారీ ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్ తో మాత్రం సినిమా అవకాశాలు అందుకోలేకపోతుంది.
