Begin typing your search above and press return to search.

ట్రెడిషనల్ లుక్ లో క్యూట్ ఎక్స్ప్రెషన్స్.. రితికా నాయక్ లేటెస్ట్ పిక్స్!

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ భామ రితికా నాయక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన నటనతోనే కాకుండా, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు హృదయాలను దోచుకుంటోంది.

By:  Madhu Reddy   |   7 Aug 2026 1:57 PM IST
ట్రెడిషనల్ లుక్ లో క్యూట్ ఎక్స్ప్రెషన్స్.. రితికా నాయక్ లేటెస్ట్ పిక్స్!
X

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ భామ రితికా నాయక్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన నటనతోనే కాకుండా, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారు హృదయాలను దోచుకుంటోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా షేర్ చేసిన ట్రెడిషనల్ ఫొటోషూట్ పిక్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ అభిమానులను అలరిస్తున్న రితికా నాయక్ లేటెస్ట్ విశేషాలు మీకోసం.




టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా ముద్ర:

ఢిల్లీ నుంచి వచ్చిన రితికా నాయక్ చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ మంచి విజయాన్ని సాధించడంతో ఆమెను టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా అభివర్ణిస్తున్నారు. ఇక కెరీర్ ప్రారంభంలోనే వరుస విజయాలు అందుకోవడం వల్ల ఆమెకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. తన క్యూట్‌నెస్‌తో ప్రతి సినిమాలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.




సినిమా ప్రయాణం.. వరుస హిట్లు:

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో రితికా తెలుగు తెరపై మెరిశారు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా, తన నటనతో మంచి మార్కులు కొట్టేశారు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన ‘హాయ్ నాన్న’ సినిమాలో ఆయన కూతురిగా చిన్న పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక అనంతరం తేజా సజ్జ సరసన వచ్చిన ‘మిరాయ్’ చిత్రంతో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. ఇటీవల వచ్చిన ‘కొరియన్ కనకరాజు’ కూడా విజయం సాధించడంతో ఆమె హ్యాట్రిక్ సక్సెస్‌లను తన ఖాతాలో వేసుకున్నారు.




సాంప్రదాయ దుస్తుల్లో అందంగా మెరిసిన రితికా నాయక్.. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రసిద్ధ డిజైనర్ భార్గవి కునమ్ డిజైన్ చేసిన పాస్టెల్ పింక్ లేహంగా సెట్‌లో ఆమె దేవకన్యలా మెరిసిపోతున్నారు. ఇక గోల్డ్ మరియు పింక్ రంగు కలయికలో జరీ, సీక్విన్ మరియు బీడ్ వర్క్‌తో చేసిన స్లీవ్‌లెస్ బ్లౌజ్ ఆమెకు ఎంతో రాయల్ లుక్‌ను తెచ్చిపెట్టింది.




అట్రాక్టివ్ లెహంగా ,దుపట్టా:

ఆమె ధరించిన పింక్ అండ్ మావ్ షేడ్‌తో కూడిన మల్టీ-టైర్డ్ లేహంగా స్కర్ట్ చాలా లేయర్లుగా ఉంటూ గ్రాండ్ లుక్‌ను ఇచ్చింది. దీనికి తోడుగా బోర్డర్‌పై జిగేల్ మనే ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న ట్రాన్స్‌పారెంట్ పాస్టెల్ పింక్ జార్జెట్ దుపట్టాను వేసుకోవడంతో ఆమె అందం రెట్టింపైంది. ఇక సాంప్రదాయ లుక్‌కు తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ తోడవ్వడంతో ఆ ఫొటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.

తన నటనతోనే కాకుండా గ్లామర్ అండ్ ఫ్యాషన్ సెన్స్‌తో కూడా రితికా నాయక్ కుర్రకారును ఆకట్టుకుంటున్నారు. ఇక సరైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో లక్కీ చార్మ్‌గా మారిన ఈ బ్యూటీ, భవిష్యత్తులో మరిన్ని పెద్ద ప్రాజెక్ట్‌లతో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుందాం.